వచ్చే నెల నిశ్చితార్థం...వచ్చే ఏడాది పెళ్లి! | Varun Sandesh's marriage with Vithika Sheru? | Sakshi
Sakshi News home page

వచ్చే నెల నిశ్చితార్థం...వచ్చే ఏడాది పెళ్లి!

Published Mon, Oct 5 2015 11:59 PM | Last Updated on Sun, Sep 3 2017 10:29 AM

వచ్చే నెల నిశ్చితార్థం...వచ్చే ఏడాది పెళ్లి!

వచ్చే నెల నిశ్చితార్థం...వచ్చే ఏడాది పెళ్లి!

‘పడ్డానండి ప్రేమలో మరి’... వరుణ్ సందేశ్, వితికా శేరు జంటగా నటించిన చిత్రం ఇది. ఈ ఇద్దరూ ఏ ముహూర్తాన ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించారో కానీ, రీల్ కోసం ప్రేమించుకోవడం మొదలుపెట్టి రియల్‌గా కూడా ప్రేమలో పడిపోయారు. కొన్ని రోజులుగా వరుణ్ సందేశ్, వితికా లవ్‌లో పడ్డారనే వార్త హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్త నిజమేనని ‘సాక్షి’కి తెలిపారు వితికా శేరు. ‘పడ్డానండి ప్రేమలో మరి’ సమయంలోనే వరుణ్, తానూ ప్రేమలో పడ్డామని ఆమె స్పష్టం చేశారు.
 
  వాస్తవానికి సీక్రెట్‌గా సాగిన వీళ్ల లవ్‌స్టోరీ మీడియా ద్వారా వెలుగులోకొచ్చింది. అదే నిశ్చితార్థానికి దారి తీసింది. మీడియాలో వచ్చిన వార్తలు తెలుసుకున్న వరుణ్, వితికాల కుటుంబ సభ్యులు ఇద్దరితోనూ మాట్లాడారు. ఈ లవ్ బర్డ్స్‌కి పెద్దల సమ్మతం కూడా లభించేసింది. వచ్చే నెలలో నిశ్చితార్థం జరపాలనుకుంటున్నారు. నవంబరులో ఉంగరాలు మార్చుకోనున్న ఈ ప్రేమికులు వచ్చే ఏడాది నవంబరులో పెళ్లి పీటల మీద కూర్చుంటారు. త్వరలో నిశ్చితార్థ తేదీని ప్రకటిస్తారు. ఆ వేడుక రోజే వివాహ తేదీని ప్రకటించే అవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement