నా కెరీర్‌లో బెస్ట్ సినిమా అవుతుంది: వరుణ్ సందేశ్ | my career Best film will be : Varun Sandesh | Sakshi
Sakshi News home page

నా కెరీర్‌లో బెస్ట్ సినిమా అవుతుంది: వరుణ్ సందేశ్

Published Mon, Jan 26 2015 11:46 PM | Last Updated on Sat, Sep 2 2017 8:18 PM

నా కెరీర్‌లో బెస్ట్ సినిమా అవుతుంది: వరుణ్ సందేశ్

నా కెరీర్‌లో బెస్ట్ సినిమా అవుతుంది: వరుణ్ సందేశ్

‘‘వరుణ్ సందేశ్ చేసే సినిమాలన్నీ బాగుంటాయి. మనింటి కుర్రాడిలా అందరికీ కనెక్ట్ అవుతాడు. అందుకే, తనంటే ఇష్టం. ‘అరుంధతి’లో నటించిన అరవింద్ ఈ చిత్రంలో మెయిన్ విలన్‌గా నటించాడు. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని దర్శకుడు కోడి రామకృష్ణ అన్నారు. వరుణ్ సందేశ్, వితికా శేరు జంటగా మహేశ్ ఉప్పుటూరి దర్శకత్వం వహించిన చిత్రం ‘పడ్డానండి ప్రేమలో మరి’. నల్లపాటి వంశీమోహన్ సమర్పణలో నల్లపాటి రామచంద్ర ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి ఖుద్దూస్ పాటలు స్వరపరిచారు.
 
 హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుకలో పాల్గొన్న ‘అల్లరి’ నరేశ్ సీడీని ఆవిష్కరించి, భీమనేని శ్రీనివాసరావుకి ఇచ్చారు. ఈ వేడుకలో దశరథ్, మెహర్ రమేశ్, శివబాలాజీ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ప్రేమ నేపథ్యంలో సాగే కుటుంబ కథా చిత్రమిది. ఇందులో వరుణ్ సందేశ్ పాత్ర వినూత్నంగా ఉంటుంది. వినోద ప్రధానంగా సాగే చిత్రం’’ అన్నారు. వరుణ్ సందేశ్ మాట్లాడుతూ- ‘‘ఇప్పటివరకు నేను చేసిన చిత్రాల్లో కొన్ని నిరాశపరిచాయి. కానీ, ఈ సినిమా మంచి ఫలితాన్నిస్తుందనే నమ్మకం ఉంది. నా కెరీర్‌లో బెస్ట్ సినిమా అవుతుంది’’ అని చెప్పారు. యువతరానికి కావల్సిన అంశాలతో రూపొందిన చిత్రం ఇదని నిర్మాత తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement