నా కెరీర్‌లో బెస్ట్ మూవీ : వరుణ్ సందేశ్ | Best Movie in my career says Varun Sandesh | Sakshi
Sakshi News home page

నా కెరీర్‌లో బెస్ట్ మూవీ : వరుణ్ సందేశ్

Published Tue, Dec 9 2014 11:55 PM | Last Updated on Sat, Sep 2 2017 5:54 PM

నా కెరీర్‌లో బెస్ట్ మూవీ : వరుణ్ సందేశ్

నా కెరీర్‌లో బెస్ట్ మూవీ : వరుణ్ సందేశ్

 యువతరాన్ని లక్ష్యంగా తీసుకొని రూపొందుతోన్న ప్రేమకథ ‘పడ్డానండీ ప్రేమలో మరి’. వరుణ్‌సందేశ్ కథానాయకునిగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా ఉప్పుటూరి మహేశ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. నల్లపాటి రామచంద్రప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాత. ఈ చిత్రం ప్రచార చిత్రాలను నిర్మాత కె.ఎస్.రామారావు, దర్శకుడు మారుజ చేతుల మీదుగా హైదరాబాద్‌లో విడుదల చేశారు.
 
 తనకిది ప్రత్యేకమైన సినిమా అనీ, తన కెరీర్‌లో బెస్ట్ మూవీగా నిలుస్తుందని వరుణ్‌సందేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు. మంచి సినిమా చేశాననే తృప్తి ఈ చిత్రం అందించిందనీ నిర్మాత తెలిపారు. భిన్నమైన కథాంశంతో రూపొందిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని దర్శకుడు నమ్మకం వెలిబుచ్చారు. వితిక షేరు కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఖుద్దూస్ ఎ.ఆర్, కెమెరా: భరణి కె.ధరన్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement