బస్సులో మిస్సుతో... | sumanth ashwin new movie shoting story | Sakshi
Sakshi News home page

బస్సులో మిస్సుతో...

Published Sat, Jan 9 2016 12:38 AM | Last Updated on Thu, Sep 27 2018 8:49 PM

బస్సులో మిస్సుతో... - Sakshi

బస్సులో మిస్సుతో...

ఓ చలాకీ కుర్రాడు. ఓ అందమైన అమ్మాయి. వీరిద్దరి మధ్యలో ఓ ఆర్టీసీ బస్సు. ఉత్తరాంధ్రలోని ఎస్. కోట నుంచి గవిటికి వెళ్లే ఆ బస్సు వీరిద్దరి మధ్యలో ప్రేమను పుట్టించిందా? ఏమో తెలీదు. తెలియాలంటే ‘రైట్... రైట్’ రిలీజయ్యే వరకు ఆగాల్సిందే. ఇంతవరకూ సుమంత్ అశ్విన్ చేసినవన్నీ మోడ్రన్ కేరెక్టర్సే. ఇందులోనేమో చాలా సింపుల్‌గా కనిపిస్తున్నాడు. స్టిల్స్ చూస్తుంటే ఇదేదో డిఫరెంట్ ప్యాట్రన్ సినిమా అనిపిస్తోంది.
 
  అది నిజమే అంటున్నారు సుమంత్ అశ్విన్. అలాగని వాణిజ్య అంశాలు వదులుకోలేదట. ఓ మలయాళ సూపర్‌హిట్ చిత్రాన్ని తెలుగుకు అనుగుణంగా ఇలా రీ-డిజైన్ చేస్తున్నారు. కొత్త దర్శకుడు మనుతో జె.వంశీకృష్ణ తీస్తున్నారీ సినిమా. ‘బాహుబలి’లో కాలకేయ పాత్రతో భయపెట్టిన ప్రభాకర్ ఇందులో ఫుల్ పాజిటివ్ రోల్ చేస్తున్నారు. పూజా ఝవేరీ కథానాయిక. ఇటీవలే అరకులోయ, ఒరిస్సాల్లో ఓ షెడ్యూలు చేసి వచ్చారు. మిగతా షూటింగ్ హైదరాబాద్, మున్నార్‌లలో చేస్తారు. శేఖర్ వి. జోసఫ్ లాంటి టాప్ కెమెరా మ్యాన్ ఈ సినిమాకి పనిచేస్తు న్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: జె.శ్రీనివాసరాజు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement