
ఆశిష్ గాంధీ, పూజా జవేరి
‘నాటకం’ మూవీ ఫేమ్ ఆశిష్ గాంధీ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘డీటీయస్’. పూజా జవేరి కథానాయిక. అభిరామ్ పిల్లాను దర్శకునిగా పరిచయం చేస్తూ గంగారెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఆశిష్ గాంధీ మాట్లాడుతూ– ‘‘నాటకం’ తర్వాత కొత్త కథల కోసం ఎదురు చూస్తున్న సమయంలో అభిరామ్ చెప్పిన కథ నచ్చింది. గంగారెడ్డిగారికి కాన్సెప్ట్ నచ్చడంతో సినిమా ప్రారంభించారు’’ అన్నారు. ‘‘ఇప్పటి వరకూ తెలుగు తెరమీద చూడని సరికొత్త కథతో ఈ సినిమా ఉంటుంది. ఈ నెల చివరి వారంలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది’’ అన్నారు. ‘‘యంగ్ టీమ్ చేస్తోన్న చిత్రమిది. ఇలాంటి కథకు సంగీతం అందించడం సంతోషంగా ఉంది’’ అన్నారు సాయి కార్తీక్.
Comments
Please login to add a commentAdd a comment