యంగ్ హీరోకి వరుస ఆఫర్స్.. తగ్గేదే లే! | Actor Ashish Gandhi Rudrangi Movie | Sakshi
Sakshi News home page

Asish Gandhi: డిఫరెంట్ సినిమాలతో అలరిస్తున్న ఆశిష్ గాంధీ

Published Mon, Jul 3 2023 6:25 PM | Last Updated on Mon, Jul 3 2023 6:25 PM

Actor Ashish Gandhi Rudrangi Movie - Sakshi

తొలి చిత్రం 'నాటకం'తో ప్రేక్షకుల మనసు దోచేసిన ఆశిష్ గాంధీ.. అప్పటి నుంచి విలక్షణ పాత్రలను ఎంపిక చేసుకుంటూ పాపులారిటీ పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తొలి చిత్రంతోనే తన నటనా ప్రతిభను బయటపెట్టిన ఆశిష్.. ఆ తర్వాత 'దర్శకుడు', 'ఉనికి' లాంటి డిఫరెంట్ సినిమాల్లో నటించారు. మరికొద్ది రోజుల్లో ఆశిష్ గాంధీ నటించిన 'రుద్రంగి' సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

(ఇదీ చదవండి: 'గుడ్ నైట్' సినిమా రివ్యూ (ఓటీటీ))

తెలంగాణ నేపథ్యంలో పీరియాడికల్ సినిమాగా రాబోతున్న ఈ 'రుద్రంగి'లో మల్లేష్ అనే కీలకపాత్ర చేస్తున్నారు. ఈ రోల్ సినిమాలో మేజర్ అట్రాక్షన్ కానుంది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్ ఆశిష్ గాంధీ రోల్‌పై ఆసక్తిని పెంచాయి. జులై 7న విడుదల కాబోతున్న ఈ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు.  

మలయాళ ప్రేక్షకులనూ తన నటనతో అలరించేందుకు రెడీ అవుతున్నారు హీరో ఆశిష్ గాంధీ. పికాసో (Picaso) అనే వైవిధ్యభరితమైన చిత్రంతో కేరళ ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేయబోతున్నారు. దీంతోపాటు మరికొన్ని సినిమాలను లైన్ లో పెట్టేసి సెట్స్‌పై బిజీ బిజీగా ఉంటున్నారు. ఆశిష్ గాంధీ చేస్తున్న తదుపరి సినిమా 'హద్దు లేదు రా'. ఇది ఆగస్టులో విడుదల కానుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో మరో చిత్రం చేసేందుకు రెడీ అయ్యారు. ఇది సెప్టెంబరు నుంచి షురూ కానుంది. 

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల‍్లోకి ఏకంగా 24 సినిమాలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement