'మూడేళ్లు సినిమాలు లేకుండా ఇంట్లో కూర్చున్నప్పుడు ‘లెజెండ్’ సినిమా అవకాశం వచ్చింది. అది నా సెకండ్ ఇన్నింగ్స్ అని అందరూ పేరు పెట్టారు. ‘రుద్రంగి’కి నా థర్డ్ ఇన్నింగ్స్ అని పేరు పెట్టుకుంటున్నాను. ఇందులోని నా పాత్రలో దమ్ము ఉంటుంది' అని నటుడు జగపతిబాబు అన్నారు.
అజయ్ సామ్రాట్ దర్శకత్వంలో జగపతిబాబు, ఆశిష్ గాంధీ, మమతా మోహన్ దాస్, విమలా రామన్, గానవి లక్ష్మణ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘రుద్రంగి’. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో జగపతిబాబు మాట్లాడుతూ– 'చిన్న సినిమా.. పెద్ద సినిమా.. పెద్ద బడ్జెట్ అనే పాయింట్ ఇవాళ దాటిపోయింది.
డబ్బులు పెడితే సూపర్ హిట్ అనేది కాదు. రీసెంట్‌గా విడుదలైన ‘సామజ వరగమన’ మంచి హిట్ అయింది. ‘రుద్రంగి’ కథ కూడా కొత్తగా ఉంటుంది' అన్నారు. రసమయి బాలకిషన్ మాట్లాడుతూ– 'జగతిబాబుగారి ప్రోత్సాహమే మమ్మల్ని ముందుకు నడిపించింది. ప్రేమకు, వాంఛకు మధ్య జరిగిన వాస్తవ కథే ‘రుద్రంగి’. నేను ఎమ్మెల్యే కాకముందు కూడా సినిమా తీశా.. ఇప్పుడు ‘రుద్రంగి’ తీశా. అంతేగానీ ఎమ్మెల్యే అని ఈ సినిమా తీయలేదు. మా సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి' అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment