క్రేజ్‌ని క్యాష్ చేసుకుంటున్నా!
‘‘నేను డైరెక్టర్ కావాలనుకుని, అది కుదరక యాక్టర్ అయినవాణ్ణి కాదు. ఒక టైమ్ పెట్టుకుని హీరోగా ట్రై చేశా. 25 ఏళ్లలోపు హీరోగా నాకంటూ ఒక బ్రేక్ రాకపోతే రైటర్‌గా, డైరెక్టర్‌గా ట్రై చేద్దామనుకుని, ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. అప్పుడే ‘ఎవడే సుబ్రమణ్యం’ అవకాశం వచ్చింది’’ అని విజయ్ దేవరకొండ చెప్పారు. శ్రీనివాస్ రవీంద్ర దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, పూజా ఝవేరి జంటగా ఆర్‌బీ చౌదరి సమర్పణలో ప్రద్యుమ్న చంద్రపాటి, గణేశ్ పెనుబోతు నిర్మించిన ‘ద్వారక’ మార్చి 3న విడుదలవుతోంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ చెప్పిన విశేషాలు
♦ ‘ద్వారక’ అనే అపార్ట్‌మెంట్ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఆ అపార్ట్‌మెంట్‌లో రకరకాల మనుషులుంటారు. ద్వారకలో ఉన్న అంతమందిని ఈ కృష్ణుడు ఎలా హ్యాండిల్ చేశాడు? అన్నదే కథాంశం. ఈ కథ ‘పెళ్లి చూపులు’ తర్వాత వచ్చినా చేసేవాణ్ణి. అంత బాగా నచ్చింది.
♦ ఈ చిత్రంలో ఎర్ర శ్రీను అనే దొంగ పాత్ర నాది. ‘ద్వారక’ అపార్ట్‌మెంట్‌లోకి చేరిన నేను అక్కడి వారికి దేవుణ్ణి ఎలా అయ్యాను? అక్కడి పరిస్థితుల్ని ఎలా చక్కదిద్దాను? అన్నది ఆసక్తిగా ఉంటుంది. స్కీన్ర్‌ప్లే చాలా బాగుంటుంది.
♦ ‘ఎవడే సుబ్రమణ్యం’లో ఎనర్జిటిక్‌గా, ‘పెళ్లి చూపులు’లో బద్ధకస్తుడిలా కనిపించా. ‘ద్వారక’లో వాటికి పూర్తి భిన్నంగా కనిపిస్తా. సొసైటీలో బాబాలు ఎలా ఉన్నారన్నది నా పాత్ర చూస్తే తెలుస్తుంది.
♦ ‘పెళ్లి చూపులు’ టైమ్‌కి పాటలు మినహా ‘ద్వారక’ చాలావరకు పూర్తయింది. ఆ చిత్రం విడుదల తర్వాత ఎలాంటి మార్పులు చేయలేదు. ‘ద్వారక’ నవంబర్ చివర్లో రావాల్సింది. కానీ, నోట్ల రద్దుతో ఆలస్యమైంది. ‘పెళ్లి చూపులు’ క్రేజ్‌ని క్యాష్ చేసుకుంటున్నాను. ఇప్పుడు రెమ్యునరేషన్ కాస్త పెంచా.
♦ ప్రస్తుతం గీతా ఆర్ట్స్‌లో రెండు సినిమాలున్నాయి. వాటిలో రాహుల్ అనే కొత్త దర్శకుడితో ఒక సినిమా, పరశురామ్‌గారితో మరో సినిమా చేస్తున్నా. ఆ తర్వాత నందిని రెడ్డి ప్రాజెక్ట్ ఉంది.