ధనుష్‌కు జోడీగా పూజా జవేరి | Pooja Jhaveri to be a part of Dhanush-Prabhu film? | Sakshi
Sakshi News home page

ధనుష్‌కు జోడీగా పూజా జవేరి

Published Mon, Aug 10 2015 2:37 AM | Last Updated on Sun, Sep 3 2017 7:07 AM

ధనుష్‌కు జోడీగా పూజా జవేరి

ధనుష్‌కు జోడీగా పూజా జవేరి

 వరుస విజయాలతో మంచి జోష్‌లో ఉన్న నటుడు ధనుష్. వేలై ఇల్లా పట్టాదారి వంటి విజయవంతమైన చిత్రం తరువాత ఇటీవల విడుదలైన మారి కూడా సక్సెస్ అనిపించుకోవడంతో యమ ఖుషీగా ఉన్న ధనుష్ ప్రస్తుతం వేలై ఇల్లా పట్టాదారి -2 చిత్రాన్ని పూర్తి చేసి ప్రభుసాల్మన్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటిం గ్ శరవేగంగా జరుపుకుంటోంది. చాలా గ్యాప్ తరువాత ప్రభు సాల్మన్ కమర్షియల్ టచ్‌తో రూపొందిస్తున్న చిత్రం ఇది. నటి కీర్తిసురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో కథ డిమాండ్ చేయడంతో మరో హీరోయిన్ కోసం ఎక్కువగానే అన్వేషిం చారు. పలువురు నటీమణుల్ని పరిశీలించి న పిదప పూజాజవేరిని ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ ఉత్తరాది బ్యూటీ తెలుగులో ఒకటి అరచిత్రాలు చేసిన కోలీవుడ్‌కు పరిచయం అవుతున్న తొలి చిత్రం ఇదే అవుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement