
దొంగ స్వామీజీ ప్రేమ!
విజయ్ దేవరకొండ, పూజా ఝవేరి జంటగా ఆర్.బి. చౌదరి సమర్పణలో ప్రద్యుమ్న చంద్రపాటి, గణేశ్ పెనుబోతు నిర్మించిన సినిమా ‘ద్వారకా’. శ్రీనివాస్ రవీంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. మార్చి 3న విడుదల చేయాలనుకుంటున్నారు.
దర్శకుడు మాట్లాడుతూ – ‘‘క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో దొంగ స్వామీజీగా విజయ్ దేవరకొండ అద్భుతంగా నటించారు. వైవిధ్యమైన కథ, కథనాలకి తోడు పూజా ఝవేరి గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పాటలు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తోంది. చిత్రానికి కూడా మంచి ప్రేక్షకాదరణ లభిస్తుందని ఆశిస్తున్నా’’ అన్నారు.