అల్లరి నరేశ్ హీరోగా, పూజా జవేరీ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం "బంగారు బుల్లోడు". తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఎప్పటిలాగే ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు నరేశ్ కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఎండకు అమ్మాయి కాళ్లు కాలుతున్నాయని నరేష్ అక్కడే ఉన్న బిందెను తన్నడం, తీరా అది వేడి నీళ్ల గిన్నె అని తెలియడంతో నాలుక్కరుచుకోవడం వంటి సీన్లు బాగున్నాయి. గుడిలో పులిహోరలాగా అమ్మాయి ఫ్రెష్‌గా ఉందని వెన్నెల కిషోర్ పెళ్లి సంబంధం కోసం తాపత్రయ పడటం యువతకు నవ్వు తెప్పిస్తోంది. ఎంటర్‌టైన్‌మెంట్ పక్కా అన్న నమ్మకాన్ని ఇస్తున్న ఈ ట్రైలర్‌పై నెటిజన్లు పాజిటివ్ కామెంట్లు చేస్తున్నారు. (చదవండి: నా గురించే ఆలోచిస్తున్నావా?: సమంత)
ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమాలు తగ్గిపోయాయి. కానీ నరేష్ చిత్రం వస్తుందంటే కుటుంబం అంతా కలిసి చూడొచ్చు అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గిరి పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ నటించిన బంగారు బుల్లోడు సినిమాలోని స్వాతిలో ముత్యమంత పాటను రీమిక్స్ చేయడం విశేషం. బంగారు బుల్లోడు జనవరి 23న థియేటర్లలో విడుదల కానుంది. కాగా నరేష్ ప్రస్తుతం నాందిలో నటిస్తున్నారు. పాత్ర డిమాండ్ మేరకు ఆయన కొన్ని సన్నివేశాల్లో నగ్నంగా నటించారు. ఈ సినిమా ద్వారా విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయమవుతుండగా సతీష్ వేగేశ్న నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. (చదవండి: అందుకే సీరియస్ క్యారెక్టర్స్ చేస్తున్నాను )
Comments
Please login to add a commentAdd a comment