అందుకే ఇంత మంచి రిజల్ట్‌! | Vijay Devarakonda Entertains as a Godman | Sakshi
Sakshi News home page

అందుకే ఇంత మంచి రిజల్ట్‌!

Published Fri, Mar 3 2017 11:49 PM | Last Updated on Tue, Aug 14 2018 3:47 PM

అందుకే ఇంత మంచి రిజల్ట్‌! - Sakshi

అందుకే ఇంత మంచి రిజల్ట్‌!

‘‘ప్రారంభం నుంచి ప్రేక్షకులను నవ్వించి, నవ్వించి... ముగింపులో మంచి సందేశం ఇచ్చిన చిత్రమిది. ప్రేక్షకులందరూ చక్కటి సందేశంతో కూడిన హాస్యభరిత చిత్రం తీశారంటుంటే ఎంతో సంతోషంగా ఉంది’’ అన్నారు నిర్మాతలు ప్రద్యుమ్న, గణేశ్‌.

విజయ్‌ దేవరకొండ, పూజా ఝవేరి జంటగా లెజెండ్‌ సినిమా పతాకంపై ప్రద్యుమ్న చంద్రపాటి, గణేశ్‌ పెనుబోతు నిర్మించిన చిత్రం ‘ద్వారక’. శ్రీనివాస్‌ రవీంద్ర దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు విడుదలైన అన్ని ఏరియాల నుంచి చక్కటి స్పందన లభిస్తోందని నిర్మాతలు అంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు చెప్పిన విశేషాలు.....

‘ద్వారక’ అవుట్‌ అండ్‌ అవుట్‌ కామెడీ ఎంటర్‌టై నర్‌. హీరో విజయ్‌ దేవరకొండతో పాటు సినిమా ఆసాంతం ‘30 ఇయర్స్‌’ పృథ్వీ చేసే కామెడీ ప్రేక్షకుల్ని నవ్విస్తోంది. కామెడీ సీన్స్‌ ఎంత నవ్వించాయో... పతాక సన్నివేశాల్లో సందేశం అంతే ఆలోచింపజేస్తోందని ప్రేక్షకులు చెబుతున్నారు. మంచి చేయడం కోసం ఒక్కోసారి చెడ్డవాళ్లను మోసం చేయడం తప్పు కాదని చెప్పే చిత్రమిది.

ముందు హీరోని అనుకుని తయారు చేసిన కథ కాదిది. కథపై ఏడాది పాటు వర్క్‌ చేశాం. పక్కాగా సిద్ధమైన తర్వాత సినిమా మొదలుపెట్టాం. అందుకే, ఇంత మంచి రిజల్ట్‌ వచ్చింది. కథ రెడీ అయ్యాకే హీరో విజయ్‌ దేవరకొండను ఎంపిక చేశాం. మా నమ్మకాన్ని నిలబెడుతూ అతను అద్భుతంగా నటించాడు. విజయ్‌లో భిన్న కోణా లను ఆవిష్కరించిన చిత్రమిది. దొంగగా, దొంగ బాబాగా, ప్రేమికుడిగా, సమాజ శ్రేయస్సు కోరు కునే మంచి వ్యక్తిగా అద్భుత నటన కనబరిచాడు.

విజయ్‌ దేవరకొండ, పృథ్వీల మధ్య మంచి కామెడీ టైమింగ్‌ కుదిరింది. వీళ్లిద్దరితో పాటు మురళీ శర్మ పాత్ర, ఆయన పలికిన డైలాగులు.. ప్రకాశ్‌రాజ్‌ పాత్ర బాగుందంటున్నారు. విజయ్, పూజా ఝవేరిల మధ్య ప్రేమ సన్నివేశాలు యువతను ఆకట్టుకుంటున్నాయి. దర్శకుడు శ్రీనివాస్‌ రవీంద్ర ప్రతి పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారు. సాయికార్తీక్‌ స్వరపరిచిన పాటలు, నేపథ్య సంగీతానికి మంచి పేరొచ్చింది.

సందేశం ఇస్తూ, వినోదం అందిస్తే ప్రేక్షకులు మంచి విజయాన్ని అందిస్తారనే నమ్మకాన్ని మా సినిమా మరోసారి నిరూ పించింది. ప్రేక్షకులెవరూ ఇది చిన్న సినిమా అనడం లేదు. ఓ మంచి సినిమా అని చెబుతున్నారు. నిన్న మంచి ఓపెనింగ్స్‌ వచ్చాయి. తర్వాత షోకి మరిన్ని వసూళ్లు పెరిగాయి. సెకండ్‌ షోకి థియేటర్లలో హౌస్‌ఫుల్‌ బోర్డులు పెట్టారు. శనివారం అడ్వాన్స్‌ బుకింగ్స్‌ బాగున్నాయి. ‘పెళ్లి చూపులు’ తర్వాత విజయ్‌ దేవరకొండ నటించిన ఈ సినిమా అతడి కెరీర్‌లో అత్యధిక థియేటర్లలో విడుదలైంది. అంతేlస్థాయిలో వసూళ్లు రాబడుతుంది.

ఓ సామాజిక బాధ్యత, సందేశంతో కూడిన వినోదాత్మక కుటుంబ కథా చిత్రాలు తీయాలనే ఉద్దేశంతో చిత్ర నిర్మాణంలోకి ప్రవేశించాం. భవిష్యతులోనూ ఇలాంటి మంచి చిత్రాలే తీస్తాం. ఈ ఏడాది మరో రెండు చిత్రాలు నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement