దొంగతో ప్రేమలో పడ్తా!
కృష్ణానంద స్వామిగా మారిన ఓ దొంగ ఏం చేశాడు? దొంగను బాబాగా మార్చింది ఎవరు? ఏం జరిగింది? అనే కథతో రూపొందిన చిత్రం ‘ద్వారక’. శ్రీనివాస్ రవీంద్ర దర్శకుడు. విజయ్ దేవరకొండ, పూజా ఝవేరీ జంటగా నటించారు. ఆర్.బి. చౌదరి సమర్పణలో ప్రద్యుమ్న, గణేశ్ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. పూజా ఝవేరీ మాట్లాడుతూ - ‘‘దొంగ బాబాగా విజయ్ దేవర కొండ, ప్రేమంటే ఆసక్తి లేని అమ్మాయి పాత్రలో నేను నటించాం.
దొంగతో ఈ అమ్మాయెలా ప్రేమలో పడింది? వీళ్లిద్దరి ప్రేమకథ ఏ మలుపులు తిరుగుతుందనేది ఆసక్తి కరం. ఓ యాడ్‌లో చూసిన దర్శకుడు నన్ను హీరో యిన్‌గా సెలెక్ట్ చేశారు. హిస్టారి కల్, మైథలాజికల్ సిన్మా లంటే ఇష్టం. అన్ని రకాల పాత్రలు చేయాల నుంది. తమిళంలో ధనుష్ ‘రైల్’తో పాటు అథర్వ మురళి సినిమా మరొకటి చేశాను. తెలుగులో ఇది నాలుగో చిత్రం’’ అన్నారు.