కృష్ణ.. గోపాలకృష్ణ
విజయ్ దేవరకొండ, పూజా ఝవేరి జంటగా ఆర్.బి. చౌదరి సమర్పణలో ప్రద్యుమ్న, గణేశ్ నిర్మిస్తున్న సినిమా ‘ద్వారక’. శ్రీనివాస్ రవీంద్ర దర్శకుడు. ‘కృష్ణ.. కృష్ణ.. గోపాలకృష్ణ’ నేపథ్య గీతంతో సాగే ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను ‘ఖైదీ నంబర్ 150’ సెట్స్‌లో హీరో చిరంజీవి, దర్శకుడు వినాయక్ విడుదల చేశారు.
‘‘నా అభిమాన హీరో మోషన్ పోస్టర్ విడుదల చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు విజయ్ దేవరకొండ. ఆర్.బి.చౌదరి, దర్శక-నిర్మాతలు పాల్గొన్నారు.