క్రైమ్‌ థ్రిల్లర్‌ 'ది సస్పెక్ట్‌' ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌.. | VN Aditya Released The Suspect Movie First Look | Sakshi
Sakshi News home page

క్రైమ్‌ థ్రిల్లర్‌ 'ది సస్పెక్ట్‌' ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌..

Published Mon, Mar 10 2025 4:23 PM | Last Updated on Mon, Mar 10 2025 4:23 PM

VN Aditya Released The Suspect Movie First Look

రుషి కిరణ్, శ్వేత, రూప, శివ యాదవ్, రజిత, ఏ కె న్ ప్రసాద్, మృణాల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ది సస్పెక్ట్. ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ మార్చి 21న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను డైరెక్టర్ విఎన్ ఆదిత్య చేతుల మీదగా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా వి.ఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లే ఉన్న ది సస్పెక్ట్ చిత్రం కచ్చితంగా హిట్ కొడుతుంది. కొత్త కథతో ఈ సినిమా తెరకెక్కించడం చాలా ఆనందమని కొనియాడారు.

రాధాకృష్ణ గర్నెపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను టెంపుల్ టౌన్ టాకీస్ బ్యానర్ మీద కిరణ్‌కుమార్‌ నిర్మించారు. ఈ చిత్రానికి కెమెరామెన్ రాఘవేంద్ర, మ్యూజిక్ డైరెక్టర్ ప్రజ్వల్ క్రిష్, ఎడిటర్ ప్రవీణ్ పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్ కె ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా ఆంధ్ర, తెలంగాణలో మార్చి 21న విడుదల చేయబోతున్నారు.

చదవండి: ఎన్నో దారుణమైన సౌత్‌ సినిమాలకంటే కంగువా బెటర్‌: జ్యోతిక

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement