‘‘కేవీ గుహన్‌గారివంటి అద్భుతమైన టెక్నీషియన్‌తో నా కుమార్తె శివానీ వర్క్ చేస్తుందని తెలిసి హ్యాపీ ఫీలయ్యాను. ఈ సినిమా షూటింగ్ సమయంలో శివానీకి కరోనా సోకింది. ఆ తర్వాత నాకూ కరోనా పాజిటివ్ అని తేలింది. తన వల్ల నాకు కరోనా వచ్చిందని శివానీ ఏడ్చింది. తను హీరోయిన్‌గా నటించిన ‘అద్భుతం’ సినిమాకు ఎంత మంచి పేరు వచ్చిందో..ఈ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ సినిమాకు అంతే మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను’’ అని రాజశేఖర్ అన్నారు. అదిత్ అరుణ్, శివానీ రాజశేఖర్ జంటగా కేవీ గుహన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ (ఎవరు.. ఎక్కడ.. ఎందుకు).
సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో రవి ప్రసాద్‌రాజు దాట్ల నిర్మించిన ఈ చిత్రం సోనీలివ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఈ నెల 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘‘గుహన్‌గారు ఈ సినిమాను కేవలం 20 రోజుల్లో షూట్ చేశారని తెలిసి షాక్ అయ్యాను. సినిమా చూశాను. పెద్ద సక్సెస్ అవుతుంది’’ అన్నారు. ‘‘పూర్తిగా వెబ్‌క్యామ్‌తో సినిమా తీశాం. కరోనా సమయంలో అసలు బతుకుతామో లేదో అనే భయంకలిగింది. ఈ భయంలో నుంచి పుట్టిన కథే ఈ చిత్రం. అదిత్ పెర్ఫార్మెన్స్ చూసి షాకయ్యాను.
శివానీ అమాయకత్వం నచ్చింది. యాక్ట్రస్‌గా నిరూపించుకోవాలనే కసి ఆమెలో కనిపించింది’’ అన్నారు కెవీ గుహన్. ‘‘నిర్మాత సురేష్‌బాబుగారు ప్రోత్సహిస్తున్నారు. మరో నిర్మాత ‘దిల్’ రాజు మా సినిమాను చూసి మెచ్చుకున్నారు’’ అన్నారు రవి. ‘‘ఇది నా 17వ సినిమా. నా కెరీర్ కొంచెం తగ్గినప్పుడు రాజశేఖర్ గారి ‘గరుడవేగ’ నాకు బూస్ట్ ఇచ్చింది.’’ అన్నారు అదిత్. ‘‘ఈ ప్రాజెక్ట్ నాకు అదిత్ వల్లే వచ్చింది. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన కేవీ గుహన్‌గారికి ధన్యవాదాలు’’ అన్నారు శివానీ. ఈ కార్య క్రమంలో సంగీత దర్శకుడు సైమన్ కింగ్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment