WWW Movie
-
‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు’ మూవీ రివ్యూ
టైటిల్: డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు (ఎవరు, ఎక్కడ, ఎందుకు) నటీనటులు: అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్, ప్రియదర్శి, దివ్య, సందీప్, రియాజ్ ఖాన్, సత్యం రాజేష్ వైవా హర్ష,తదితరులు సమర్ఫణ: సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ: రామంత్ర క్రియేషన్స్ నిర్మాత: డా. రవి ప్రసాద్ రాజు దాట్ల దర్శకత్వం: కె వి గుహన్ సంగీతం: సైమన్ కె. కింగ్ ఎడిటింగ్: తమ్మిరాజు విడుదల తేది: డిసెంబర్ 24, 2021(సోనిలీవ్) సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా రామంత్ర క్రియేషన్స్ పతాకంపై డా. రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మించిన థ్రిల్లర్ మూవీ 'డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు'(ఎవరు, ఎక్కడ, ఎందుకు). ఫస్ట్ టైమ్ కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ మూవీగా రూపొందిన ఈ చిత్రం డిసెంబరు 24న సోనిలీవ్‌లో విడుదలైంది. ఇప్పటికే విడుదలైన టీజర్,ట్రైలర్, పాటలు ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. తెలుగులో వస్తున్న ఫస్ట్ కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ మూవీ కావడం, డి. సురేష్ బాబు, దిల్‌రాజు లాంటి అగ్ర నిర్మాతలు ఈ సినిమాకు సపోర్ట్ చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. భారీ అంచనాల మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే..? విశ్వ(అదిత్ అరుణ్), అష్రఫ్(ప్రియదర్శి), సదా సత్యం రాజేష్), చిష్ట్రీ(దివ్య శ్రీపాద) అనే నలుగురు సాఫ్ట్వేర్ టెకీలు మంచి స్నేహితులు. వీరంతా వేరు వేరు నగరాల్లో ఉంటూ కంప్యూటర్ లో నే వర్చువల్ గా మాట్లాడుకుంటూ సరదాగా చిల్ అవుతూ వుంటారు. చిష్ట్రీ కి మిత్ర(శివాని రాజశేఖర్) మంచి ఫ్రెండ్. ఆమె ఉంటున్న అపార్ట్మెంట్లోకి మిత్ర వస్తుంది. చిష్ట్రీ ద్వారా విశ్వకి మిత్ర పరిచయమవుతుంది. దీంతో వీరిద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు. అదికాస్త ముదిరి ప్రేమగా మారుతుంది. అయితే ఉన్నట్టుండి కరోన కారణంగా రాత్రికి రాత్రే సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తారు. దాంతో మిత్ర అక్కడే లాక్ అయిపోతుంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి (సందీప్, కిల్లింగ్ వీరప్పన్ ఫేమ్) ఫ్లాట్ లోకి చొరబడి.. చిష్ట్రీని విచక్షణా రహితంగా పొడిచేసి గాయాపరుస్తాడు. మిత్రను కూడా దారుణంగా చంపేస్తా అని ఆమెను కూడా చిత్రహింసలకు గురిచేస్తాడు. దీన్ని వర్చువల్ గా చూసిన విశ్వ హాతాశుడైపోయి… ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటాడు. అలానే మిత్రను కూడా దారుణంగా చంపుతానని బెదిరిస్తాడు. ఆమె బతకాలంటే నువ్వు ఉరేసుకుని చస్తే… మిత్రను వదిలేస్తా అంటాడు. అసలు ఆ వ్యక్తి ఎవరు?, విశ్వని ఎందుకు ఉరివేసుకుని చావమన్నాడు. ఆ వ్యక్తి నుండి విశ్వ మిత్ర, చిష్ట్రిలను కాపాడాడా లేదా అనేది మిగతా సినిమా కథ.. ఎవరెలా చేశారంటే...? ఈ సినిమాలో పాత్రలు చాలా తక్కువ. వాళ్లు కూడా నేరుగా కలుసుకోరు. అంతా వెబ్ కెమెరాల ద్వారానే కలుసుకుంటారు. ఇల్లీగల్ హ్యాకర్ హెడ్ విశ్వగా అదిత్ అరుణ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా చావుబతుకుల కొట్టుమిట్టాడే ప్రియురాలిని ఎలా కాపాడుకోవాలో తెలియక కొట్టుమిట్టాడే ఓ సిన్సియర్ లవర్ పాత్రలో లీనమై నటించాడు. . ‘అద్భుతం’తర్వాత శివానీ రాజశేఖర్ నటించిన మరో చిత్రం ఇదే. ఈ చిత్రంలో ఆమె పాత్రకి పెద్దగా స్కోప్ లేదు కానీ.. ఉన్నంతలో బాగానే నటించింది. తెరపై చాలా క్యూట్‌గా కనిపించింది. ఇక ప్రియదర్శి, దివ్య, సత్యం రాజేష్ వారి పాత్రలకు తగ్గట్టు చేశారు. కిల్లింగ్ వీరప్పన్ ఫేమ్ సందీప్ కూడా ఉన్న కాసేపు అయినా భయపెట్టి.. ప్రేక్షకులను అసలు సిసలు థ్రిల్ ను పరిచయం చేశాడు. వైవా హర్ష… తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. రియాజ్ ఖాన్ సైబర్ క్రైమ్ పోలీసు అధికారి గా కనిపించి మెప్పించారు. ఎలా ఉందంటే..? ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న మాటా సైబర్ ఎటాక్. మనకు తెలియకుండా.. మన డేటాని హ్యాకర్లు దొంగిలించి ఇతరులకు అమ్ముకుంటున్నారు. దాని వల్ల చాలా మంది నష్టపోతున్నారు. ఇదే కాన్సెప్ట్‌ని తీసుకొని ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు’మూవీని తెరకెక్కించాడు దర్శకుడు కె.వి. గుహన్. సమకాలీన ప్రపంచంలో కంప్యూటర్ టెకీలు ఎలా తమకున్నటాలెంట్ ని దుర్వినియోగం చేసి… విలాసవంతమైన లైఫ్ కి అలవాటు పడి.. సమాజంలో ఎలా దోషులుగా మారుతున్నారనేదాన్ని అందరికి తెలిసేలా ఓ మంచి సందేశాన్ని ఇచ్చాడు. ఫస్ట్ టైమ్ కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ మూవీగా రూపొందిన ఈ చిత్రం… రెండు కంప్యూటర్ల స్క్రీన్ మీదనే సినిమా మొత్తం రన్ కావడం సూపర్ థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఇలాంటి స్టోరీ ఐడియా దర్శకుడికి రావడమే నిజంగా అభినందిచాల్సిన విషయమే. అయితే దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌ని తెరపై చూపించడంతో కాస్త తడపడ్డాడు. విశ్వ, క్రిస్టీ, అష్రఫ్, సదాలు ఏం చేస్తారన్న దానితో కథను మొదలు పెట్టిన దర్శకుడు.. ఆ తర్వాత విశ్వ-మిత్రల ప్రేమ కథతో సన్నివేశాలను సాగదీశాడు. అసలు పాయింట్‌కు రావడానికి చాలా సమయమే పట్టింది. ఓ దుండగుడు చిష్ట్రీ, మిత్రలు ఉంటున్న అపార్ట్మెంట్కి రావడం.. చిష్ట్రీని కత్తితో దాడి చేయడంతో సినిమాపై ఆసక్తి పెరుగుంది. ఆ ఆగంతకుడు ఎవరు? అతనికి విశ్వకి మధ్య ఉన్న సంబంధం ఏంటనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. అయితే దానికి దర్శకుడు చూపించిన రీజన్ మాత్ర చాలా పేలవంగా ఉంది. ఆగంతకుడి నేపథ్యాన్ని సాదాసీదాగా మాటల రూపంలో చెప్పించాడు అంతే. ఆగంతకుడి ప్లాష్ బ్యాక్‌ని ఇంకాస్త బలంగా చూపిస్తే.. సినిమా ఫలితం మరోలా ఉండేది. థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు. ఇక సాంకేతికత విషయానికొస్తే.. సైమన్ కె. కింగ్ సంగీతం బాగుంది. పాటలు అంతంత మాత్రమే అయినా.. నేపథ్య సంగీతం చాలా బాగుంది. తనదైన బీజీఎంతో కొన్ని సీన్స్‌కి ప్రాణం పోశాడు. గుహన్ సినిమాటోగ్రఫి సినిమాకు చాలా ప్లస్ అయింది. కొన్ని సన్నివేశాల్లో విజువల్స్ గూజ్బమ్స్ తెప్పించేలా ఉన్నాయి. తమ్మిరాజు ఎడిటింగ్ పర్వాలేదు. రామంత్ర క్రియేషన్స్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. మొత్తంగా చెప్పాలంటే ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు’ ఫలితం ఎలా ఉంటుందో తెలియదు కానీ.. ప్రయత్నం మాత్రం బాగుంది. -
ఆకట్టుకుంటోన్న `డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు` క్యారెక్టర్ పోస్టర్స్
అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం'డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు'(ఎవరు, ఎక్కడ, ఎందుకు). సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో రామంత్ర క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా డా. రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 24 నుంచి ప్రముఖ ఓటీటీ సోనిలివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఫస్ట్ టైమ్ కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ మూవీగా రూపొందిన ఈ చిత్రమిది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కి విశేష స్పందన లభించగా.. తాజాగా ఈ చిత్రంలోని నటీనటుల పాత్రలకు సంబందించి క్యారెక్టర్ పోస్టర్స్ విడుదలయ్యాయి. ఈ మూవీలో అరుణ్ `విశ్వ`గా నటిస్తుండగా, శివాని రాజశేఖర్ `మిత్ర` పాత్ర పోషిస్తుంది. వారి మిత్రులుగా `అష్రఫ్` పాత్రలో ప్రియదర్శి, `చిష్ట్రి` పాత్రలో దివ్య శ్రీపాద నటిస్తున్నారు. వైవా హర్ష, సత్యం రాజేష్ ముఖ్య పాత్రలు పోషిస్తుండగా నటుడు రియాజ్ ఖాన్ `ఖాన్`పాత్రధారిగా కనిపించనున్నారు. ఈ కాన్సెప్ట్ పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. -
క్రిస్మస్కి ఓటీటీ, థియేటర్లో సందడి చేయబోయే చిత్రాలివే!
కరోనా తగ్గుముఖం పట్టాక ఇండస్ట్రీ సినిమా రిలీజ్‌ల మీద దృష్టిపెట్టింది. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు థియేటర్ వరకు కదిలి వస్తారని అఖండ, పుష్ప సినిమాలు నిరూపించడంతో చిన్న చిత్రాల నుంచి భారీ బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ బరిలో దూకుతున్నాయి. ముఖ్యంగా ఈ వారం పెద్దపెద్ద సినిమాలు కూడా రిలీజవుతున్నాయి. అటు థియేటర్‌తో పాటు ఓటీటీలో కూడా పలు చిత్రాలు సందడి చేయనున్నాయి. అవేంటో చూద్దాం.. క్రిస్మస్కు థియేటర్లో సందడి చేయబోయే చిత్రాలివే! నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నేచురల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 24న థియేటర్లో విడుదలకు సిద్ధమవుతోంది. కాగా గతంలో నాని నటించిన టక్ జగదీశ్ ఓటీటీలో విడుదల కావడంతో ఆయన అభిమానులు నిరాశపడ్డారు. ఇప్పుడు ‘శ్యామ్ సింగరాయ్’ థియేటర్లోనే విడుదలవుతుండటంతో అతడి ఫ్యాన్స్ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 1983 వరల్డ్ కప్ నేపథ్యంలో కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘83’. రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్, జీవా, తాహీర్ రాజ్ భాసీన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. టిమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ బయోపిక్‌గా రూపొందిన ఈ చిత్ర రణ్వీర్ సింగ్ లీడ్ రోల్ పోషిస్తుండగా దీపికా ఆయన భార్య రోమి భాటియాగా నటిస్తోంది. కబీర్ ఖాన్, విష్ణు ఇందూరి, దీపిక పదుకొనె, సాజిద్ నడియాడ్వాలా, ఫాంటమ్ ఫిలిమ్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, 83 ఫిలిమ్ లిమిటెడ్‌లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 24 దేశ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. సప్తగిరి, నేహా సోలంకి జంటగా కె.యమ్.కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గూడు పుఠాణి’. పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి, కటారి రమేష్ నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ థ్రిల్లర్ డిసెంబరు 25న థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రఘు కుంచె ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో రూపొందించిన ఈ చిత్రం ఆరంభం నుంచి చివరి వరకు ఆసక్తిని రేకెత్తిస్తూ సాగుతుందని ప్రచార చిత్రాలను చూస్తే అర్థమవుతోంది. పూర్ణ ప్రధాన పాత్రలో కర్రి బాలాజీ తెరకెక్కించిన చిత్రం ‘బ్యాక్‌డోర్’. బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మాత. ప్రణవ్ స్వరాలందించారు. ఈ సినిమాని డిసెంబర్ 25న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ‘‘వైవిధ్యభరితమైన కథాంశంతో.. చక్కటి సందేశమిస్తూ సినిమాని రూపొందించాం. పూర్ణ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అని నిర్మాత తెలియజేశారు. యాక్షన్ ప్రియులను విశేషంగా అలరించిన చిత్రం ‘ది మ్యాట్రిక్’. 1999లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ‘ది మ్యాట్రిక్స్ రీలోడెడ్’, ‘ది మ్యాట్రిక్స్ రెవెల్యూషన్స్’ చిత్రాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దాదాపు 13ఏళ్ల తర్వాత ఈ సిరీస్‌లో వస్తున్న చిత్రం ‘ది మ్యాట్రిక్స్ రీసర్కషన్స్’ లానా వచౌస్కీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబరు 22న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కీనూ రీవ్స్, క్యారీ అన్నె మోస్‌లతో పాటు, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కీలక పాత్ర పోషిస్తుస్తోంది. ఈ చిత్రంలో ఆమె సతి అనే సాహసోపేతమైన పాత్ర పోషిస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఆనంద్ చంద్ర తెరకెక్కించిన చిత్రం ‘ఆశ ఎన్కౌంటర్’. 2010లో యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన హైదరాబాద్ గ్యాంగ్‌రేప్‌ను ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. హైదరాబాద్ నగరశివారులోని చటాన్‌పల్లి వద్ద ఓ యువతిపై కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడి.. అనంతరం ఆమెను అతి క్రూరంగా హత్య చేశారు. ఇదే కథను నేపథ్యంగా చేసుకుని ఆనంద్ చంద్ర ‘ఆశ ఎన్కౌంటర్’ తెరకెక్కించాడు. డిసెంబరు 25న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్జీవీ సమర్పణలో అనురాగ్ కంచర్ల ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఓటీటీలోకి స్ట్రీమింగ్ అయ్చే చిత్రాలు ఇవే డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు (ఎవరు, ఎక్కడ, ఎందుకు) ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ చిత్రం 'డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు (ఎవరు, ఎక్కడ, ఎందుకు)'. తొలిసారిగా కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ మూవీగా రూపొందిన ఈ చిత్రంలో అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ జంటగా నటించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదల అవుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ 'సోని లివ్', డిసెంబర్ 24న స్ట్రీమింగ్ కానుంది. సురేశ్ ప్రొడక్షన్స్ సమర్పణలో రామంత క్రియేషన్స్ పతాకంపై డా. రవి ప్రసాద్ రాజు దాట్ల ఈ చిత్రాన్ని నిర్మించాడు. ‘వరుడు కావలెను’ నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన చిత్రం ‘వరుడు కావలెను’. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించారు. ప్రేమ, కుటుంబం, అనుబంధాల నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ఇప్పుడు జీ5 ఓటీటీ వేదికగా డిసెంబరు 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అతరంగీ రే బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్, కోలీవుడ్ నటుడు ధనుష్ కలిసి నటిస్తున్న చిత్రం ‘అతరంగీ రే’. సారా అలీఖాన్ కథానాయిక. ఆనంద్ ఎల్. రాయ్ దర్శకుడు. ఈ సినిమా ఓటీటీ ‘డిస్నీ ప్లస్ హాట్‌స్టార్’ వేదికగా డిసెంబరు 24 నుంచి స్ట్రీమింగ్కానుంది. ఇంద్రజాలికుడిగా అక్షయ్‌కుమార్, ప్రేమికులుగా ధనుష్, సారా అలీఖాన్ కనిపించనున్నారు. సత్యమేవ జయతే జాన్ అబ్రహం కథానాయకుడిగా తెరకెక్కి విజయం సాధించిన చిత్రం ‘సత్యమేవ జయతే’. దానికి కొనసాగింపుగా ‘సత్యమేవ జయతే 2’ వచ్చిన సంగతి తెలిసిందే. మిలాప్ జవేరీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివ్యా కోస్లా కుమార్ ఓ కీలక పాత్రలో నటించింది. యాక్షన్ సన్నివేశాలకు ఇందులో పెద్ద పీట వేశారు. కాగా, డిసెంబరు 24వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. పరంపర మూవీ సరిగ్గా ఉండడానికి, మంచిగా ఉండడానికి మధ్య జరిగే పోరాటంలో ఎప్పుడైనా స్పష్టమైన విజేత ఉంటాడా? కుటుంబ సంబంధాలలో చెడు వారసత్వాన్ని ఉంచడం దీర్ఘకాలంలో ఉపయోగపడుతుందా?లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుందా? వంటి విషయాలకు సమాధానం కావాలంటే ‘పరంపర’ చూడాల్సిందే అంటున్నారు ‘బాహుబలి’ నిర్మాతలు. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై కృష్ణ విజయ్ ఎల్, విశ్వనాథ్ అరిగెల దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్‌ను నిర్మించారు. హరి యెల్లేటి కథను అందించారు. డిసెంబర్ 24న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ‘పరంపర’ స్ట్రీమింగ్ కానుంది. మానాడు తమిళ నటుడు శింబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మానాడు’. గత నెలలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులోనూ ‘లూప్’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టైం లూప్ అనే వినూత్న కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో హీరో పాత్రతోపాటు పోలీసు ఆఫీసర్ ‘డీసీపీ ధనుష్కోటి’ పాత్ర కూడా ఎంతో కీలకం. ఈ పాత్రను నటుడు, దర్శకుడు ఎస్.జె సూర్య పోషించారు. కాగా, ఇప్పుడు ఈ చిత్రం డిసెంబరు 24న ప్రముఖ ఓటీటీ సోనీలివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. -
‘ఆ భయంలో నుంచి పుట్టిన కథే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఈ చిత్రం’
‘‘కేవీ గుహన్గారివంటి అద్భుతమైన టెక్నీషియన్‌తో నా కుమార్తె శివానీ వర్క్ చేస్తుందని తెలిసి హ్యాపీ ఫీలయ్యాను. ఈ సినిమా షూటింగ్ సమయంలో శివానీకి కరోనా సోకింది. ఆ తర్వాత నాకూ కరోనా పాజిటివ్ అని తేలింది. తన వల్ల నాకు కరోనా వచ్చిందని శివానీ ఏడ్చింది. తను హీరోయిన్గా నటించిన ‘అద్భుతం’ సినిమాకు ఎంత మంచి పేరు వచ్చిందో..ఈ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ సినిమాకు అంతే మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను’’ అని రాజశేఖర్ అన్నారు. అదిత్ అరుణ్, శివానీ రాజశేఖర్ జంటగా కేవీ గుహన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ (ఎవరు.. ఎక్కడ.. ఎందుకు). సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో రవి ప్రసాద్‌రాజు దాట్ల నిర్మించిన ఈ చిత్రం సోనీలివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ నెల 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘‘గుహన్‌గారు ఈ సినిమాను కేవలం 20 రోజుల్లో షూట్ చేశారని తెలిసి షాక్ అయ్యాను. సినిమా చూశాను. పెద్ద సక్సెస్ అవుతుంది’’ అన్నారు. ‘‘పూర్తిగా వెబ్‌క్యామ్‌తో సినిమా తీశాం. కరోనా సమయంలో అసలు బతుకుతామో లేదో అనే భయంకలిగింది. ఈ భయంలో నుంచి పుట్టిన కథే ఈ చిత్రం. అదిత్ పెర్ఫార్మెన్స్ చూసి షాకయ్యాను. శివానీ అమాయకత్వం నచ్చింది. యాక్ట్రస్‌గా నిరూపించుకోవాలనే కసి ఆమెలో కనిపించింది’’ అన్నారు కెవీ గుహన్. ‘‘నిర్మాత సురేష్‌బాబుగారు ప్రోత్సహిస్తున్నారు. మరో నిర్మాత ‘దిల్’ రాజు మా సినిమాను చూసి మెచ్చుకున్నారు’’ అన్నారు రవి. ‘‘ఇది నా 17వ సినిమా. నా కెరీర్ కొంచెం తగ్గినప్పుడు రాజశేఖర్ గారి ‘గరుడవేగ’ నాకు బూస్ట్ ఇచ్చింది.’’ అన్నారు అదిత్. ‘‘ఈ ప్రాజెక్ట్ నాకు అదిత్ వల్లే వచ్చింది. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన కేవీ గుహన్‌గారికి ధన్యవాదాలు’’ అన్నారు శివానీ. ఈ కార్య క్రమంలో సంగీత దర్శకుడు సైమన్ కింగ్, తదితరులు పాల్గొన్నారు. -
ఆ సమయంలో శివానీ బాగా ఏడ్చేసింది.. ఎప్పుడూ మర్చిపోను : రాజ శేఖర్
‘నాకు కరోనా సోకినప్పుడు భయపడలేదు. కానీ నా కుటుంబ సభ్యులు చాలా బాధపడ్డారు. ‘డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు’మూవీ టీమ్ నుంచే శివానికి కోవిడ్ సోకింది. ఆమె నుంచి నాకు వచ్చింది. ఆ సమయంలో శివాని చాలా బాధపడింది. నా వల్లే డానీకి కరోనా సోకిందని ఏడ్చేసింది. ఆ జీవితాన్ని నేను ఎప్పుడూ మర్చిపోను’అన్నారు సీనియర్ హీరో రాజశేఖర్. అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం'డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు'(ఎవరు, ఎక్కడ, ఎందుకు). సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో రామంత్ర క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా డా. రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 24 నుంచి ప్రముఖ ఓటీటీ సోనిలివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. తోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హీరో రాజశేఖర్, జీవిత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ.. డా. రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘గుహన్ వండర్ ఫుల్ టెక్నీషియన్. గరుడ వేగలో మా పరిచయం జరిగింది. ఏజ్ డిఫరెన్స్ లేకుండా ఫ్రెండ్స్‌లా తిరిగాం. ఆయనతో శివానీ సినిమా చేస్తుందని తెలియడంతో ఆనందమేసింది. సినిమా ఫాస్ట్‌గా వస్తుందని చెప్పారు. ఇప్పుడు కరెక్ట్ సమయానికి వస్తోంది. డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు అంటే నాకు జీవితంలో కొన్ని గుర్తుకువస్తాయి. కోవిడ్‌ను చూసి నేను భయపడలేదు. ఈ టీం నుంచే శివానికి కరోనా వచ్చింది. అక్కడి నుంచి నాకు వచ్చింది. నా వల్ల డాడీకి వచ్చిందని శివానీ బాగా ఏడ్చేసింది. ఈ జీవితాన్ని నేను ఎప్పుడూ మరిచిపోను. ఈ చిత్రం మా జీవితంలో ముఖ్య పాత్రను పోషిస్తుంది. మరిచిపోలేని ఈ సినిమా డిసెంబర్ 24న వస్తోంది. అద్భుతం సినిమాకు ఎంత మంచి పేరు వచ్చిందో.. ఈసినిమాకు కూడా అంత మంచి పేరు వస్తుందని అంటున్నారు. నాకు ఎంతో గర్వంగా ఉంది. నా పేరు నిలబెట్టిందని అందరూ అంటుంటే సంతోషంగా ఉంది. ప్రేక్షకులు అందరూ కూడా ఈ సినిమాను చూడాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘చిన్నప్పుడు మా పిల్లలు ఎప్పుడూ షూటింగ్‌లకు వచ్చేవారు. రాజశేఖర్ అవుట్ డోర్‌కు వెళ్తే తీసుకెళ్లేవారు. అప్పుడు కెమెరా వెనక ఉండేవారు. ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చారు. ఊహ వచ్చాక సినిమాల్లోకి వస్తామని మాతో నేరుగా చెప్పేశారు. సినిమాల్లో సక్సెస్ కాకపోతే డిప్రెషన్లోకి వెళ్లొద్దు.. వేరే కెరీర్ ఎంచుకోవాలని అన్నాం. శివానీ నటించిన అద్భుతం సినిమా మంచి విజయం సాధించింది. నైలు నది అనే పాట నాకు చాలా ఇష్టం. ఒక సినిమా ఒక హీరో లేదా ఇద్దరు హీరోలుంటారు. కానీ ఈ సినిమాకు నలుగురు హీరోలు. అదిత్, గుహన్, సైమన్, నిర్మాత గారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది. నేను సినిమా చూశాను. అదిత్ చాలా బాగా చేశాడు. శివానీ కూడా కష్టపడి చేసింది. గుహన్ గారు ఈ సినిమాను కేవలం 20 రోజుల్లో షూట్ చేశారు. అంత ఫాస్ట్‌గా ఎలా తీశారా? అని నేను షాక్ అయ్యాను. ఈ సినిమా తప్పకుండా అద్భుతంగా ఉండబోతోంది’ అని అన్నారు. అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్, ప్రియదర్శి, వైవా హర్ష, దివ్య, రియాజ్ ఖాన్, సత్యం రాజేష్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సైమన్ కె. కింగ్ సంగీతం అందిస్తున్నారు. -
ఓటీటీలోకి 'డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు' చిత్రం
WWW Movie Release In Sony Liv OTT: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ చిత్రం 'డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు (ఎవరు, ఎక్కడ, ఎందుకు)'. తొలిసారిగా కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ మూవీగా రూపొందిన ఈ చిత్రంలో అదిత్ అరుణ్, శివాని రాజశేకర్ జంటగా నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, పాటలకు విశేష ఆదరణ దక్కింది. తాజాగా ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ప్రముఖ ఓటీటీ సంస్థ 'సోని లివ్', 'డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు' సినిమా డిజిటల్ రైట్స్‌ని ఫ్యాన్సీ ధరకు దక్కించుకుంది. అతి త్వరలో ఈ చిత్రం 'సోని లివ్'లో స్ట్రీమ్ అవనుంది. ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో రామంత క్రియేషన్స్ పతాకంపై డా. రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మించారు. చిత్ర నిర్మాత మాట్లాడుతూ 'మా మొదటి చిత్రానికి సురేష్ ప్రొడక్షన్స్ సమర్పకులుగా వ్యవహరించడం చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ టైమ్ తెలుగులో వస్తున్న కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ మూవీ ఇది. ఓటీటీకి పర్ఫెక్ట్ ఛాయిస్. సోని వంటి ఇంటర్నేషనల్ సంస్థతో అసోసియేట్ అవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా సోని లివ్ ద్వారా మరింత ఎక్కువ మందికి చేరుతుందని ఆశిస్తున్నాం. గుహన్ మేకింగ్, అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ కెమిస్ట్రీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.' అని అన్నారు. అయితే సినిమాను ఎప్పుడు విడుదల చేస్తామని ప్రకటించలేదు. -
ఎవరు.. ఎక్కడ.. ఎందుకు?.. థ్రిల్‌గా ఫీలయ్యా : సురేశ్ బాబు
అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు’(ఎవరు, ఎక్కడ, ఎందుకు). రామంత్ర క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా డా. రవి పి. రాజు దాట్ల నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ భాగస్వామ్యంతో థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్మాత సురేశ్ బాబు మాట్లాడుతూ.. డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు చిత్రాన్ని క్రిస్పీ నరేషన్తో మంచి పెర్ఫామెన్స్లతో చాలా థ్రిల్లింగ్‌గా తెరకెక్కించారు. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్ని, ఈ కరోనా వల్ల వర్చువల్ వరల్డ్ లో వచ్చిన మార్పులని చక్కగా చూపించారు. అంతర్లీనంగా ఒక మంచి ప్రేమకథ కూడా ఉంది. ఆడియోకి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు వంటి ఒక మంచి చిత్రాన్ని మీకు థియేటర్లలో అందిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది`అన్నారు. (చదవండి: మేయర్ అభ్యర్థిగా సోనూసూద్.. క్లారిటీ ఇచ్చిన ‘రియల్ హీరో’!) చిత్ర నిర్మాత డా. రవి పి. రాజు దాట్ల మాట్లాడుతూ.. ‘మా బేనర్లో రూపొందిన ఫస్ట్ మూవీ `డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు` చిత్రానికి సురేశ్ ప్రొడక్షన్స్ సమర్పకులుగా వ్యవహరించడం చాలా సంతోషంగా ఉంది. ఇది మా ఫస్ట్ సక్సెస్ గా భావిస్తున్నాం. ఈ సందర్భంగా సురేశ్ బాబుగారికి మా బ్యానర్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ టైమ్ తెలుగులో వస్తోన్న కంప్యూటర్ స్క్రీన్ మూవీ ఇది. గుహన్‌గారి మేకింగ్ చాలా కొత్తగా ఉంటుంది. అలాగే అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ ఇద్దరు సెటిల్డ్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. వారిద్దరి కెమిస్ట్రి తప్పకుండా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. త్వరలో ట్రైలర్ రిలీజ్ చేయనున్నాం. కమర్షియల్‌గా పెద్ద విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది`` అన్నారు. చిత్ర దర్శకుడు కేవీ గుహన్ మాట్లాడుతూ - ``సినిమా చాలా బాగా వచ్చింది. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఈ మూవీ విడుదలవడం నిజంగా హ్యీపీగా ఉంది. అదిత్, శివాణి ఇద్దరు చాలా బాగా నటించారు. టెక్నీషియన్స్ అందరూ మంచి సపొర్ట్ అందించారు. తప్పకుండా ఒక డిఫరెంట్ మూవీ అవుతుంది` అన్నారు. -
WWW Movie: శివాని రాజశేఖర్ స్పెషల్ పోస్టర్ విడుదల
అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’(హూ వేర్ వై). `118` వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఫస్ట్ కంప్యూటర్ స్క్రీన్ తెలుగు సినిమా ఇది. ఈ చిత్రాన్ని రామంత్ర క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా డా. రవి పి. రాజు దాట్ల నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్స్, అలాగే ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజైన టీజర్, లిరికల్ సాంగ్స్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. కాగా ఈ రోజు (జులై 1) హీరోయిన్ శివాని రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా ఆమె స్పెషల్ బర్త్‌డే పోస్టర్ ని విడుదలచేసి శుభాకాంక్షలు తెలిపింది చిత్ర యూనిట్. ఈ మూవీలో `మిత్ర` అనే పాత్రలో శివాని నటిస్తున్నట్లు తెలిపారు మేకర్స్. ఆహ్లాదకరంగా ఉన్న ఈ స్పెషల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగాచిత్ర నిర్మాత డా. రవి పి.రాజు దాట్ల మాట్లాడుతూ - ``ముందుగా మా హీరోయిన్ శివాని రాజశేఖర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ మూవీలో `మిత్ర` అనే పాత్రలో నటించారు. చాలా ఛాలెంజింగ్ పాత్ర అయినప్పటికీ తన నటనతో పూర్తిన్యాయం చేశారు. గుహన్ గారి స్టైలిష్ మేకింగ్, అదిత్, శివానిల అద్భుతమైన నటన డెఫినెట్‌గా ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తాయి`` అన్నారు. చదవండి: కొడుకుతో రోజా డ్యాన్స్.. వీడియో వైరల్