Shivani Rajashekar Poster Released From WWW Movie | Shivani Rajasekhar Birthday - Sakshi
Sakshi News home page

WWW Movie: శివాని రాజ‌శేఖ‌ర్ స్పెషల్‌ పోస్టర్‌ విడుదల

Published Thu, Jul 1 2021 2:49 PM | Last Updated on Thu, Jul 1 2021 3:31 PM

Shivani Rajasekhar Special Poster Release From WWW Movie - Sakshi

అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’(హూ వేర్ వై). `118` వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని తెర‌కెక్కించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కేవి గుహన్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఫస్ట్‌ కంప్యూటర్‌ స్క్రీన్‌ తెలుగు సినిమా ఇది. ఈ చిత్రాన్ని రామంత్ర క్రియేషన్స్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా డా. రవి పి. రాజు దాట్ల నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్స్‌, అలాగే ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజైన‌ టీజ‌ర్‌, లిరిక‌ల్ సాంగ్స్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది.

కాగా ఈ రోజు (జులై 1) హీరోయిన్ శివాని రాజ‌శేఖ‌ర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆమె స్పెష‌ల్  బ‌ర్త్‌డే పోస్ట‌ర్ ని విడుద‌ల‌చేసి శుభాకాంక్ష‌లు తెలిపింది చిత్ర యూనిట్‌. ఈ మూవీలో `మిత్ర` అనే పాత్ర‌లో శివాని న‌టిస్తున్న‌ట్లు తెలిపారు మేక‌ర్స్‌. ఆహ్లాద‌క‌రంగా ఉన్న ఈ స్పెష‌ల్ పోస్ట‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.

ఈ సందర్భంగాచిత్ర నిర్మాత డా. రవి పి.రాజు దాట్ల  మాట్లాడుతూ -  ``ముందుగా మా హీరోయిన్ శివాని రాజ‌శేఖ‌ర్ గారికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు. ఈ మూవీలో `మిత్ర` అనే పాత్ర‌లో న‌టించారు. చాలా ఛాలెంజింగ్ పాత్ర అయిన‌ప్ప‌టికీ త‌న న‌ట‌న‌తో పూర్తిన్యాయం చేశారు. గుహ‌న్ గారి స్టైలిష్ మేకింగ్‌, అదిత్, శివానిల అద్భుత‌మైన న‌ట‌న డెఫినెట్‌గా ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తాయి`` అన్నారు.
చదవండి:
కొడుకుతో రోజా డ్యాన్స్‌.. వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement