
WWW Movie Release In Sony Liv OTT: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ చిత్రం 'డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు (ఎవరు, ఎక్కడ, ఎందుకు)'. తొలిసారిగా కంప‍్యూటర్ స్క్రీన్ బేస్డ్ మూవీగా రూపొందిన ఈ చిత్రంలో అదిత్ అరుణ్, శివాని రాజశేకర్ జంటగా నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, పాటలకు విశేష ఆదరణ దక‍్కింది. తాజాగా ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ప్రముఖ ఓటీటీ సంస్థ 'సోని లివ్', 'డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు' సినిమా డిజిటల్ రైట్స్‌ని ఫ్యాన్సీ ధరకు దక్కించుకుంది. అతి త‍్వరలో ఈ చిత్రం 'సోని లివ్'లో స్ట్రీమ్ అవనుంది. ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో రామంత క్రియేషన్స్ పతాకంపై డా. రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మించారు.
చిత్ర నిర్మాత మాట్లాడుతూ 'మా మొదటి చిత్రానికి సురేష్ ప్రొడక్షన్స్ సమర్పకులుగా వ్యవహరించడం చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ టైమ్ తెలుగులో వస్తున్న కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ మూవీ ఇది. ఓటీటీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్. సోని వంటి ఇంటర్నేషనల్ సంస్థతో అసోసియేట్ అవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా సోని లివ్ ద్వారా మరింత ఎక్కువ మందికి చేరుతుందని ఆశిస్తున్నాం. గుహన్ మేకింగ్, అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ కెమిస్ట్రీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.' అని అన్నారు. అయితే సినిమాను ఎప్పుడు విడుదల చేస్తామని ప్రకటించలేదు.
Sticky for cinema
Comments
Please login to add a commentAdd a comment