టాలీవుడ్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కెమెరా మెన్‌గా పని చేసిన గుహన్ మెగా ఫోన్ పట్టుకుని చేసిన మొదటి సినిమా 118. కళ్యాణ్ రాం హీరోగా తెరకెక్కిన ఆ సినిమా మంచి ఫలితాన్ని అందుకుంది. ఇక రెండో చిత్రంగా ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ: హూ.. వేర్.. వై’(ఎవరు.. ఎక్కడ.. ఎందుకు) అనే ట్యాగ్‌లైన్‌తో మరో థ్రిల్లర్‌ని తెరకెక్కిస్తున్నారు. ఆదిత్ అరుణ్, శివానీ రాజశేఖర్, వైవా హర్ష, ప్రియదర్శి, దివ్య శ్రీపాద కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఆఫీషియల్ టీజర్‌ను సంక్రాతి కానుకగా సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేశారు. (చదవండి: చెక్ మాస్టర్)
55 సెకన్ల నిడివి గల టీజర్‌లో సినిమా ఎలా ఉండబోతుందో చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. టీజర్‌ని బట్టి చూస్తే సినిమా సైబర్ థ్రిల్లర్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది. నువ్వు నవ్వినప్పుడు డబుల్ అందంగా ఉంటావ్ తెలుసా.. నిన్ను వచ్చి కలిసేవరకు ఈ కాల్ కట్ చేయను అంటూ సరదగా సాగిన టీజర్ ఆ తర్వాత నా సిస్టమ్ పని చేయడం లేదు.. బ్రూట్ ఫోర్స్ ఎటాక్ అంటూ థ్రిల్లర్ పార్ట్‌లోకి ఎంటర్ అవుతుంది. ఇక రామంత్ర క్రియేషన్స్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సిమాన్ కే కింగ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా.. డాక్టర్ రవి పీ రాజు దట్ల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment