Priyadarshi Pullikonda
-
కథ వినగానే కన్నీళ్లు ఆగలేదు.. ప్రియదర్శి ఎమోషనల్
ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ జంటగా నటించిన సినిమా బలగం. జబర్దస్త్ కమెడియన్ వేణు యెల్దండి ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 3న విడుదలై సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లో రన్ అవుతోంది. విడుదలైన మొదటిరోజు నుంచే పాజిటివ్ టాక్‌తో మంచి వసూళ్లు రాబడుతోంది. తెలంగాణ గొప్పదనాన్ని.. సంప్రదాయాలు, సంస్కృతితో తెరకెక్కిన ఈ సినిమా సినీ ప్రేమికుల మనసు దోచుకుంది. ఈ చిత్రంలో హీరో ప్రియదర్శి అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. పలు సినిమాల్లో ప్రియదర్శి కమెడియన్‌గా కనిపించేవారు. అయితే ఈసారి హీరోగా మెప్పించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రియదర్శి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ప్రియదర్శి మాట్లాడుతూ.. 'ఓ రోజు దిల్ రాజు నుంచి కాల్ వచ్చింది. దీంతో నేను షాక్‌కు గురయ్యా. ఆ తరువాత వేణు యేల్దండి వచ్చి కథ చెప్పగా నేను ఏడవటం మొదలుపెట్టా. దిల్ రాజుకి ఫోన్ చేసి సినిమా చేస్తానని చెప్పేశా. కానీ బలగం విడుదలైన రోజు కలెక్షన్లు అంతగా లేవు. మేము వెళ్లిన థియేటర్ కేవలం సగం మాత్రమే నిండిపోయింది. నేనూ, వేణు యేల్దండి చాలా బాధపడ్డాం. మంచి సినిమా చేశాం. కానీ దిల్ రాజు ఓ విషయం చెప్పారు. జనాలు థియేటర్లకు రావడానికి రెండు రోజులు సమయం పడుతుంది. ఆయన చెప్పినట్లుగానే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతోంది'. అంటూ సంతోషం వ్యక్తం చేశారు ప్రియదర్శి. -
భారీ ధరకు బలగం ఓటీటీ రైట్స్.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ జంటగా నటించిన సినిమా బలగం. జబర్దస్త్ కమెడియన్ వేణు యెల్దండి ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. తెలంగాణ గ్రామీణ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 3న విడుదలై సక్సెస్‌ఫుల్‌గా థియేరట్ల వద్ద రన్ అవుతుంది. విడుదలైన మొదటిరోజు నుంచే పాజిటివ్ టాక్‌తో మంచి కలెక్షన్లను రాబడుతుంది. మౌత్ టాక్ కూడా యాడ్ అవడంతో ఊహించిన దానికంటే ఎక్కవగానే ప్రేక్షకాదరణ లభిస్తుంది.రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకి భిన్నంగా చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. తాజాగా బలగం చిత్రం డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. భారీ ధరకే ఓటీటీ రైట్స్ అమ్ముడైనట్లు తెలుస్తుంది. ఇక మంచి కలెక్షన్స్ రాబడుతున్న ఈ చిత్రం ఏప్రిల్ రెండో వారంలో డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. -
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్న హరికథ.. సాంగ్ రిలీజ్ చేసిన ప్రియదర్శి
కిరణ్, రంజిత్, సజ్జన్, అఖిల రామ్, లావణ్య రెడ్డి, కీర్తి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'హరికథ'. ఐరావత సినీ కలర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనుదీప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రంజిత్ కుమార్ గౌడ్, వివేకా నంద, రఘు , కవిత సంయుక్తంగా నిర్మించారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న హరికథ సినిమాలోని "పిల్లా నీ చేతి గాజులు" అనే పాటను ప్రముఖ నటుడు ప్రియదర్శి విడుదల చేశారు. ఈ సాంగ్‌కు యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం చివరి దశ పనులను జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. -
ఆడిషన్స్‌కి వెళ్లినప్పుడు దారుణంగా అవమానించారు: ప్రియదర్శి
పెళ్లి చూపుల సినిమాతో ఒక్కసారిగా అందరిని దృష్టిని ఆకర్షించాడు నటుడ ప్రియదర్శి. ఈ సినిమాలో నా చావు నేను చస్తా నీకెందుకు అనే డైలాగ్ ప్రేక్షకులను కడుబ్బా నవ్వించాడు. ఈ డైలాగ్ అతడు రాత్రి రాత్రే ప్రయదర్శి స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ది ఘాజి ఎటాక్, అర్జున్ రెడ్డి, జై లవకుశ, జాతి రత్నాలు, రాధే శ్యామ్, సీతారామం, ఒకే ఒక జీవితం వంటి సినిమాల్లో నటించాడు. కమెడియన్‌గా, నటుడి వరుస ఆఫర్లు అందుకుంటున్నాడు. చదవండి: నన్ను అలా అనడంతో మేకప్ రూంకి వెళ్లి ఏడ్చా: నటి ప్రగతి అలాగే మల్లేశం సినిమాలో లీడ్ రోల్ పోషించిన ప్రియదర్శి తన అద్భుతమైన నటనతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. కేవలం సినిమాల్లోనే కాదు పలు వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తూ కెరీర్లో దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ఓ టాక్‌లో షో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా తన కెరీర్, మూవీస్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఈ మేరకు ప్రియదర్శి మాట్లాడుతూ.. టెర్రర్ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చానని చెప్పాడు. సినిమాటోగ్రాఫ్ అవుతానని ఇంట్లో చెప్పి వచ్చాననన్నాడు. చదవండి: దీపావళి సందర్భంగా కాబోయే భర్తను పరిచయం చేసిన హీరోయిన్ అయితే ఇక్కడికి వచ్చాక నటుడిగా ఆడిషన్స్ ఇస్తున్న క్రమంలో తనని ఘెరంగా అవమానించేవారంటూ చేదు సంఘటనలను గుర్తు చేసుకున్నాడు. ‘ఆడిషన్స్‌కి వెళ్లినప్పుడు నల్లగా, సన్నగా ఉన్నానంటూ విమర్శించేవారు. కొన్ని సార్లు హీరో కంటే పొడుగ్గా ఉన్నానని కూడా నన్ను రిజెక్ట్ చేశారు. కానీ అవేవి నేను పట్టించుకోలేదు. ఆ సమయంలో టెర్రర్లో ఓ పాత్రకు నేనే సరిగ్గా సరిపోతానని వారే నాకు ఫోన్ చేశారు’ అని చెప్పుకొచ్చాడు. కాగా పెళ్లి చూపులు సినిమాకి గానూ ఉత్తమ హాస్యనటుడిగా ప్రియదర్శి సైమా, ఐఫా అవార్డులు అందుకున్నాడు. -
‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ: హూ.. వేర్.. వై’
టాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కెమెరా మెన్‌గా పని చేసిన గుహన్ మెగా ఫోన్ పట్టుకుని చేసిన మొదటి సినిమా 118. కళ్యాణ్ రాం హీరోగా తెరకెక్కిన ఆ సినిమా మంచి ఫలితాన్ని అందుకుంది. ఇక రెండో చిత్రంగా ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ: హూ.. వేర్.. వై’(ఎవరు.. ఎక్కడ.. ఎందుకు) అనే ట్యాగ్‌లైన్‌తో మరో థ్రిల్లర్‌ని తెరకెక్కిస్తున్నారు. ఆదిత్ అరుణ్, శివానీ రాజశేఖర్, వైవా హర్ష, ప్రియదర్శి, దివ్య శ్రీపాద కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఆఫీషియల్ టీజర్‌ను సంక్రాతి కానుకగా సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేశారు. (చదవండి: చెక్ మాస్టర్) 55 సెకన్ల నిడివి గల టీజర్లో సినిమా ఎలా ఉండబోతుందో చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. టీజర్‌ని బట్టి చూస్తే సినిమా సైబర్ థ్రిల్లర్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది. నువ్వు నవ్వినప్పుడు డబుల్ అందంగా ఉంటావ్ తెలుసా.. నిన్ను వచ్చి కలిసేవరకు ఈ కాల్ కట్ చేయను అంటూ సరదగా సాగిన టీజర్ ఆ తర్వాత నా సిస్టమ్ పని చేయడం లేదు.. బ్రూట్ ఫోర్స్ ఎటాక్ అంటూ థ్రిల్లర్ పార్ట్లోకి ఎంటర్ అవుతుంది. ఇక రామంత్ర క్రియేషన్స్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సిమాన్ కే కింగ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా.. డాక్టర్ రవి పీ రాజు దట్ల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. -
కరోనా: నటుడు ప్రియదర్శి హోమ్ క్వారంటైన్!
సాక్షి, హైదరాబాద్: ప్రాణాంతక కరోనా (కోవిడ్) వ్యాప్తి నియంత్రణకు వ్యక్తిగత పరిశుభ్రత, ఇతరులకు దూరంగా ఉండటమే మేలైన మార్గాలని పలు పరిశోధనలు, వైద్యశాస్త్ర నిపుణులు చెప్పడం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ హాస్యనటుడు ప్రియదర్శి స్వీయ నిర్భందంలోకి వెళ్లిపోయారు. ఇటీవల ప్రభాస్ సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు జార్జియా వెళ్లిన ఆయన షూటింగ్ ముగించుకుని వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలో కరోనా వైరస్ స్క్రీనింగ్ అనంతరం ఆయన హోమ్ క్వారంటైన్లో ఉండిపోయారు. తనకు తాను క్లీన్ చిట్ ఇచ్చుకునేందుకు బాధ్యతగా 14 రోజులు ప్రజలకు దూరంగా ఉండాలని ప్రియదర్శి నిర్ణయించుకున్నారు. (చదవండి: బర్త్‌డే వేడుకలు క్యాన్సిల్ చేసిన చెర్రీ) -
కొత్తగా ‘బ్రోచేవారెవరురా’
వైవిధ్యమైన కథాంశాలతో మెప్పిస్తూ హీరోగా తనకంటూ ప్రత్యేకత గుర్తింపు తెచ్చుకున్న శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘బ్రోచేవారెవరురా’. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కుమార్ మన్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీవిష్ణుతో పాటు లేటెస్ట్ సెన్సేషన్స్ ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో కనపడతున్నారు. ఈ త్రయం రంగురంగుల దుస్తులు, షేడ్స్‌తో స్కూటర్ రైడ్ చేస్తున్నట్టుగా ఈ పోస్టర్ డిజైన్ చేశారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా రూపొందుతున్న రెండో చిత్రం ‘బ్రోచేవారెవరురా’. ‘చలనమే చిత్రము.. చిత్రమే చలనము’ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. శ్రీవిష్ణు సరసన నివేదా థామస్ హీరోయిన్గా నటిస్తుండగా సత్యదేవ్, నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యువ సంగీత దర్శకుడు వివేక్ సాగర్ సంగీత సారథ్యం అందిస్తున్నాడు. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను మే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
అంత పెద్ద ఆశ లేదంటున్న హాస్యనటుడు
పెళ్లిచూపులు సినిమాలో ఆయన చేసిన కామెడీని ఎంజాయ్ చేయని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఆయనకు ఆసినిమా జాతీయ స్థాయిలో పెద్ద గుర్తింపు తీసుకువచ్చింది. ఆ తరువాత టాలీవుడ్లో వరుస చిత్రాలతో నవ్వుల పువ్వులు పూయిస్తున్న టాలీవుడ్ యువ కమెడియన్ ప్రియదర్శితో సాక్షి చిట్‌చాట్.. చదువు అనంతరం కష్టపడి సినీ అవకాశాలు పొందిన తాను, సినిమా పరిశ్రమలో ఉత్తమ కమిడియన్‌గా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా స్థానం సాధించుకోవడమే తన లక్ష్యమని యువ హాస్యనటుడు ప్రియదర్శి పులికొండ అన్నారు. తండ్రి ఆచార్య పులికొండ సుబ్బాచారి పదవీ విరమణ కోసం ద్రవిడ విశ్వవిద్యాలయానికి వచ్చిన ఆయన్ను సాక్షి పలకరించింది. సాక్షి : సినిమా అవకాశాలు ఎలా వచ్చాయి..? ప్రియదర్శి : షార్ట్ ఫిలిమ్‌ల ద్వారానే సినిమాలో అవకాశం వచ్చింది. దర్శకుడు తరుణŠ భాస్కర్ పెళ్ళిచూపులు సినిమాలో అవకాశం కల్పించారు. సాక్షి : మొదటి సినిమాకే అవార్డులు రావడం ఎలా అనిపించింది...? ప్రియదర్శి : మొదటి సినిమా పెళ్ళిచూపులు సినిమాకు జాతీయ స్థాయి అవార్డు రావడం మంచి గుర్తింపు లభించింది. జీవితంలో మరుపురాని సినిమాగా నాకు నిలిచిపోయింది. సాక్షి : ప్రస్తుతం ఏ సినిమాల్లో నటిస్తున్నారు...? ప్రియదర్శి : విక్టరీ వెంకటేష్, వరుణ్‌తేజ్‌ల మల్టీస్టారర్ సినిమా ఎఫ్2, పడిపడి లేచే మనసు, డూడ్, మిఠాయి సినిమాలలో నటిస్తున్నాను. వీటితో పాటు మరో ఐదు సినిమాల్లో నటిస్తున్నాను. సాక్షి : తమిళ సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయా..? ప్రియదర్శి : తమిళంలో బైలింగువల్ సినిమాల్లో నటిస్తున్నాను. రీసెంట్గా స్పైడర్ సినిమాలో నటించాను. తమిళం నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి. సాక్షి : హీరోగా ప్రేక్షకులను అలరించే అవకాశం ఉందా..? ప్రియదర్శి : అంత పెద్ద ఆశ లేదు గానీ.. సినీ పరిశ్రమలో ఉత్తమ నటుడుగా గుర్తింపు పొందాలని వుంది. సాక్షి : కుప్పంలో వాతావరణ ఎలా ఉంది.? ప్రియదర్శి : కుప్పం నాకు ప్రత్యేకమైంది. మా నాన్న గత 15 ఏళ్ళుగా ఇక్కడే పనిచేస్తున్నారు. ఇక్కడి వాతావరణం ఊ టీని తలపిస్తుంది. కుప్పం నాకు రెండో ఇళ్లు లాంటింది. సాక్షి : షార్ట్ ఫిలిమ్స్‌లో ఇంకా నటిస్తున్నారా..? ప్రియదర్శి : సినిమాల్లో అవకాశాలు వస్తుండంలో షార్ట్ ఫిలిమ్స్‌లో నటించడానికి సమయం దొరడం లేదు. సినిమాల్లో అవకాశం పొందడానికి షార్ట్ ఫిలిమ్స్ మంచి ఫ్లాట్‌ఫారం లాంటింది. -
‘W/O రామ్’ మూవీ రివ్యూ
టైటిల్ : W/O రామ్ జానర్ : థ్రిల్లర్ తారాగణం : మంచు లక్ష్మీ, ప్రియదర్శి, ఆదర్శ్, సామ్రాట్ సంగీతం : రఘు దీక్షిత్ దర్శకత్వం : విజయ్ ఎలకంటి నిర్మాత : టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల, మంచు లక్ష్మీ స్టార్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మీ నటిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సంపాదించుకున్నారు. ఇప్పటికే విలక్షణ పాత్రలో మెప్పించిన ఆమె తాజాగా W/O రామ్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తెలుగు తెర మీద అరుదుగా కనిపించే క్రైం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాతో విజయ్ ఎలకంటి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. టీజర్, ట్రైలర్లతోనే ఇంట్రస్ట్ క్రియేట్ చేసిన W/O రామ్ ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది..? నటిగా మంచు లక్ష్మీ మరోసారి ఆకట్టుకున్నారా..? కథ; గాయపడిన ఆరునెలల గర్భవతి ‘దీక్ష’ (మంచు లక్ష్మీ) హాస్పిటల్లో కోలుకుంటుంది. కళ్లు తెరిచిన దీక్షకు తన భర్త రామ్ (సామ్రాట్), కడుపులోని బిడ్డ చనిపోయారని తెలుస్తుంది. అప్పటి వరకు ప్రమాదంగా భావిస్తున్న పోలీసులకు తన భర్తది హత్య చేశారని, హుడీ వేసుకున్న వ్యక్తి తనను గాయపరిచి తన భర్తను లోయలో పడేశాడని చెపుతుంది. ఎన్ని రోజులు గడిచినా పోలీసుల ఇన్వెస్టిగేషన్ ముందుకు కదలకపోవటంతో తానే స్వయంగా ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో రమణ చారీ (ప్రియదర్శి) అనే కానిస్టేబుల్ దీక్షకు సాయం చేస్తాడు. ఎంతో కష్టపడి ఈ క్రైం వెనుక ఉన్నది బ్యాంకాక్‌లో ఉండే రాఖీ (ఆదర్శ్) అని దీక్ష తెలుసుకుంటుంది. ఈలోగా విషయం తెలుసుకున్న ఆదర్శ మనుషులు.. దీక్షను చంపేందుకు ప్రయత్నిస్తారు. ఈ ప్రమాదాల నుంచి దీక్ష ఎలా తప్పించుకుంది..? రామ్ మరణానికి కారణం ఏంటి..? రాఖీని ఎలా అంతం చేసింది..? దీక్ష అంత రిస్క్ చేసి తానే స్వయంగా ఇన్వెస్టిగేషన్ చేయడానికి కారణం ఏంటి..? అన్నదే మిగత కథ. నటీనటులు ; సినిమాను మంచు లక్ష్మీ వన్ ఉమెన్ షోలా నడిపించారు. కథ అంతా ఆమె చుట్టూనే తిరుగుతుంది. సినిమాలో ఒకటి రెండు సీన్స్ తప్ప మంచు లక్ష్మీ తెరమీద కనిపించని సీన్స్ ఉండవు. ఇంత బాధ్యతను సమర్థవంతంగా పూర్తి చేశారు లక్ష్మీ. భర్తను కోల్పోయిన బాధను దిగమింగుతూ అతని చావుకు కారణాలు వెతికే మహిళగా మంచి నటన కనబరిచారు. కొన్ని సన్నివేశాల్లో ఆమె ఎమోషన్స్ ను అండర్ ప్లే చేసిన తీరు సూపర్బ్ అనిపిస్తుంది. మరో ప్రధాన పాత్రలో నటించిన ప్రియదర్శి ఆకట్టుకున్నాడు. ఎక్కువగా కామెడీ పాత్రల్లో కనిపించిన ప్రియదర్శి.. సిన్సియర్ సీరియస్ కానిస్టేబుల్‌గా మెప్పించాడు. కరప్టడ్ పోలీస్ పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ మంచి నటన కనబరిచాడు. ఆదర్శ్ విలన్ రోల్ లో పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యాడు. సామ్రాట్‌ది నటనకు పెద్దగా అవకాశం లేని అతిథి పాత్రే. విశ్లేషణ ; తొలి సినిమానే థ్రిల్లర్ జానర్ లో చేసే ప్రయత్నం చేసిన దర్శకుడు విజయ్ ఎలకంటి తన వంతు ప్రయత్నం చేశాడు. ఎక్కడా తాను అనుకున్న జానర్ నుంచి పక్కకుపోకుండా పర్ఫెక్ట్ థ్రిల్లర్‌ను తెరకెక్కించేందుకు ప్రయత్నించాడు. కమర్షియాలిటీ కోసం పాటలు, కామెడీ ఇరికించకుండా కథను నడిపించాడు. అయితే థ్రిల్లర్ సినిమాలో ఉండాల్సిన వేగం మాత్రం కథనంలో కనిపించలేదు. భర్త, బిడ్డను కోల్పోయిన ఒంటరి మహిళను కుటుంబ, సభ్యులు చుట్టాలు పట్టించుకోకపోవటం కూడా విచిత్రంగా అనిపిస్తుంది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఆసక్తికరంగానే ఉన్నా.. తరువాత వచ్చే సీన్స్ ఆ స్థాయిలో లేవు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ రఘు దీక్షిత్ మ్యూజిక్. చాలా సన్నివేశాలను రఘు మ్యూజిక్ డామినేట్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ ; మంచు లక్ష్మీ నటన నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ ; కథనంలో వేగం లేకపోవటం సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
ప్రియదర్శి ఇంట ‘పెళ్లి సందడి’
పెళ్లిచూపులు సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన యువ నటుడు ప్రియదర్శి ప్రస్తుతం టాలీవుడ్లో బిజీ కమెడియన్‌గా కొనసాగుతున్నాడు. ముఖ్యంగా యంగ్ హీరోలకు ఫ్రెండ్‌గా దాదాపు అన్నిసినిమాల్లో కనిపిస్తున్నాడు ఈ హాస్యనటుడు. తెలంగాణ యాసలో తనదైన కామెడీ టైమింగ్‌తో దూసుకుపోతున్నాడు. కెరీర్ పరంగానే కాదు వ్యక్తిగత జీవితంలోనూ ప్రియదర్శి కొత్త బంధాల్లోకి అడుగుపెట్టబోతున్నాడు. ప్రేమికుల రోజు సందర్భంగా తనకు కాబోయే జీవిత భాగస్వామి రిచాను అభిమానులకు పరిచయం చేశాడు ప్రియదర్శి. తాజాగా వీరి వివాహానికి సంబంధించిన మరిన్ని వార్తలు ఫిలిం నగర్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ నెల 23న హైదరాబాద్‌లో ప్రియదర్శి వివాహం జరగనుంది. ఈ కార్యక్రమంలో కేవలం ఇరు కుటుంబాల పెద్దలు మాత్రమే పాల్గొననున్నారు. తరువాత ఇండస్ట్రీ ప్రముఖుల కోసం 26న గ్రాండ్ గా రిసెప్షన్‌ను నిర్వహించనున్నారు. -
అ! ప్రీ రిలీజ్ ఈవెంట్