
ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ జంటగా నటించిన సినిమా బలగం. జబర్దస్త్ కమెడియన్ వేణు యెల్దండి ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. తెలంగాణ గ్రామీణ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 3న విడుదలై సక్సెస్‌ఫుల్‌గా థియేరట్ల వద్ద రన్ అవుతుంది. విడుదలైన మొదటిరోజు నుంచే పాజిటివ్ టాక్‌తో మంచి కలెక్షన్లను రాబడుతుంది.
మౌత్ టాక్ కూడా యాడ్ అవడంతో ఊహించిన దానికంటే ఎక్కవగానే ప్రేక్షకాదరణ లభిస్తుంది.రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకి భిన్నంగా చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. తాజాగా బలగం చిత్రం డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది.
భారీ ధరకే ఓటీటీ రైట్స్ అమ్ముడైనట్లు తెలుస్తుంది. ఇక మంచి కలెక్షన్స్ రాబడుతున్న ఈ చిత్రం ఏప్రిల్ రెండో వారంలో డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
Comments
Please login to add a commentAdd a comment