ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న హరికథ.. సాంగ్ రిలీజ్ చేసిన ప్రియదర్శి | Actor Priyadarshi released the song From Harikatha Movie | Sakshi
Sakshi News home page

Harikatha Movie: ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న హరికథ.. సాంగ్ రిలీజ్ చేసిన ప్రియదర్శి

Published Sat, Oct 29 2022 9:27 PM | Last Updated on Sat, Oct 29 2022 9:31 PM

Actor Priyadarshi released the song From Harikatha Movie - Sakshi

కిరణ్, రంజిత్, సజ్జన్, అఖిల రామ్, లావణ్య రెడ్డి, కీర్తి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'హరికథ'. ఐరావత సినీ కలర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనుదీప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రంజిత్ కుమార్ గౌడ్, వివేకా నంద, రఘు , కవిత సంయుక్తంగా  నిర్మించారు. 

లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న  హరికథ సినిమాలోని  "పిల్లా నీ చేతి గాజులు" అనే పాటను ప్రముఖ నటుడు ప్రియదర్శి విడుదల చేశారు. ఈ సాంగ్‌కు యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం చివరి దశ పనులను జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement