భరత్ నారంగ్, సుమ,నవనీత్ శ్రీరామ్, ప్రియదర్శి
ప్రియదర్శి (Priyadarshi) హీరోగా, ఆనంది, సుమ కనకాల ప్రధాన పాత్రల్లో నటించనున్న సినిమాకు ‘ప్రేమంటే?’ అనే టైటిల్ ఖరారైంది. ‘థ్రిల్– యూప్రాప్తిరస్తు’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. నవనీత్ శ్రీరామ్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ, స్పిరిట్ మీడియా పతాకాలపై జాన్వీ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది.
తొలి సీన్‌కి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో రానా క్లాప్ ఇచ్చారు. ‘‘నిర్మాతగా జాన్వీ నారంగ్‌కు ఇది తొలి సినిమా. సునీల్, భరత్ నారంగ్‌ల మార్గదర్శకత్వంలో జాన్వీ నారంగ్ కంటెంట్–బేస్డ్ సినిమా ప్రపంచంలోకి తన ప్రయాణాన్నిప్రారంభించారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమా పూజా కార్యక్రమంలో సునీల్ నారంగ్, అభిషేక్ నామా, సుధాకర్ రెడ్డి, రామ్మోహన్ రావు, జనార్ధన్ రెడ్డి, విజయ్ కుమార్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: లియోన్ జేమ్స్, సహ–నిర్మాత: ఆదిత్య మెరుగు.
Comments
Please login to add a commentAdd a comment