బుల్లితెరపై యాంకర్ సుమ స్టార్.. వెండితెరపై రాజీవ్ కనకాల ఓ చిన్నపాటి స్టార్. వీరిద్దరి జంట చూడముచ్చటగా ఉంటుంది. కానీ ఎందుకో మరి గతంలో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం జరిగింది. సంపాదన విషయంలోనూ అభిప్రాయబేధాలు వచ్చాయని పుకార్లు షికార్లు చేశాయి. అదంతా ఏమీ లేదని చెప్పినా వీరి గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజీవ్ కనకాల తన వైవాహిక జీవితం గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
చనిపోతాను అనగానే బాధ్యత తీసుకున్నా
'మా అమ్మానాన్న ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు. చెన్నైలో సినిమా ఇన్‌స్టిట్యూట్ పెడుతున్నారనగానే జాబ్ మానేసి అక్కడికి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొంతకాలానికే ఇన్‌స్టిట్యూట్ మూసేశారు. అమ్మ మళ్లీ రాష్ట్ర ఉద్యోగం కొట్టింది. నాన్న నటుడిగా నెమ్మదిగా సినిమాలు చేసుకుంటూ గుర్తింపు పొందాడు. తర్వాత ఆయన దర్శకుడిగా మారి సినిమాలు తీశాడు. 1985లో సొంతంగా ఇన్‌స్టిట్యూట్ పెట్టుకున్నాం. అప్పటినుంచి వరుసగా కష్టాలే! ఎప్పుడూ డబ్బులుండేవి కాదు. రూ.100, రూ.500 కోసం కూడా అప్పు చేయాల్సి వచ్చింది. అదే సమయంలో నాన్నకు వారి సోదరులతో కలహాలు వచ్చాయి. వీటన్నింటిని తట్టుకోలేకపోయిన ఆయన ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నా అన్నాడు. నేనున్నా కదా నాన్న అని సర్ది చెప్పి పరిస్థితిని సీరియస్‌గా తీసుకున్నా. వచ్చిన అవకాశాలన్నీ చేసుకుంటూ పోయాను.
సుమతో విబేధాలు.. అందుకోసమే అలా చేస్తున్నా
కంటి మీద కునుకు లేకుండా వరుస సీరియల్స్ చేసేవాడిని. పెళ్లయిన తర్వాత ఇద్దరం కలిసి అప్పులు అంతా తీర్చేశాం. మధ్యలో ఒకసారి ఓ సీరియల్‌కు డైరెక్షన్ చేశాను. ఏడాదిదాకా ఏ సినిమా ఛాన్సూ రాలేదు. అందుకే నేను నటనకే అంకితమయ్యాను. సుమ, నేను సంతోషంగా ఉన్నాం. మా మధ్య దూరం పెరిగిందని లేనిపోనివి రాస్తున్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకే అప్పుడప్పుడూ తన ప్రోగ్రామ్‌లకు హాజరవుతున్నాను. కలిసి రీల్స్ కూడా చేస్తున్నాం. ఈ విడాకుల రూమర్స్ విని నేను బాధపడ్డాను. కానీ సుమ అయితే ఏమాత్రం పట్టించుకోలేదు. తర్వాత నేను కూడా లైట్ తీసుకోవడం మొదలుపెట్టాను' అని చెప్పుకొచ్చాడు రాజీవ్ కనకాల.
చదవండి: అందుకే సౌత్‌ను పట్టించుకోను.. అక్కడ హీరో, దర్శకుడు కాంప్రమైజ్ అడిగారు: నటి
రెండో భార్యతో కలిసి తిరుమలను దర్శించిన ప్రభుదేవా
Comments
Please login to add a commentAdd a comment