యాంకర్‌ సుమకు స్టేజీపై ముద్దు పెట్టిన నటుడు | Daniel Caltagirone Kisses Anchor Suma Hand In Thangalaan Movie Pre Release Event | Sakshi
Sakshi News home page

యాంకర్‌ సుమకు స్టేజీపై ముద్దు పెట్టిన నటుడు

Aug 5 2024 10:34 AM | Updated on Aug 5 2024 11:09 AM

Daniel Caltagirone Kisses Anchor Suma Hand In Thangalaan Movie Pre Release Event

యాంకర్‌ సుమ ఎలాంటి పరిస్థితులనైనా ఈజీగా హ్యాండిల్‌ చేస్తుంది. పంచ్‌లు వేయడమే కాదు, ఎదుటివాళ్లు వేసే పంచ్‌లకు రివర్స్‌ కౌంటర్‌ ఇవ్వడమూ తెలుసు. ఎప్పుడూ కూల్‌గా నవ్వుతూ, నవ్విస్తూ ఉండే సుమకు తాజాగా ఓ ఇబ్బందిరక పరిస్థితి ఎదురైంది. తంగలాన్‌ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో నటుడు డేనియల్‌ కాల్టగిరోన్‌ను స్టేజీపైకి ఆహ్వానించిన సుమ.. అతడితో తెలుగులో మాట్లాడించే ప్రయత్నం చేసింది. 

షేక్‌ హ్యాండ్‌ ఇస్తే..
అందరూ బాగున్నారా? మీరు తప్పకుండా ఈ సినిమాను ఆగస్టు 15న చూడాలి అని చెప్పించింది. చివర్లో చిన్న ఫన్‌ క్రియేట్‌ చేసేందుకు ప్రయత్నించింది. ఇక్కడ ఉండే అమ్మాయిల్లో సుమయే అందంగా ఉంది అని నటుడితో అనిపించింది. ఆ లైన్‌ కరెక్ట్‌గా చెప్పడంతో సంతోషంతో షేక్‌ హ్యాండ్‌ ఇచ్చింది. కానీ డేనియల్‌.. ఆమె చేతికి ముద్దు పెట్టడంతో అవాక్కయింది. వెంటనే తమాయించుకుని సరదాగా స్పందించింది. 

కవర్‌ చేసిన సుమ
ఓరి నాయనో.. రాజా, ఈయన మా అన్నయ్య.. రాఖీ పండగ వస్తోంది అంటూ కవర్‌ చేసి.. అన్నయ్య సన్నిధి.. అని పాటందుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇకపోతే చియాన్‌ విక్రమ్‌ హీరోగా నటించిన లేటెస్ట్‌ మూవీ తంగలాన్‌. పార్వతి తిరువోతు, మాళివక మోహనన్‌ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో ఆగస్టు 15న విడుదల కానుంది.

 

చదవండి: ధనుష్‌ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా..: హీరో సోదరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement