విడాకులు తీసుకుంటున్నారా? అని నాన్నను అడిగా: రోషన్‌ | Anchor Suma Son Roshan Kanakala About Her Parents Disturbance | Sakshi
Sakshi News home page

Roshan Kanakala: అమ్మానాన్న విడాకుల రూమర్స్‌.. నేరుగా వాళ్లనే అడిగేశా..

Published Sun, Dec 10 2023 10:31 AM | Last Updated on Sun, Dec 10 2023 10:58 AM

Anchor Suma Son Roshan Kanakala About Her Parents Disturbance - Sakshi

నటుడు రాజీవ్‌ కనకాల-యాంకర్‌ సుమ దంపతుల తనయుడు రోషన్‌ కనకాల వెండితెరపై పూర్తి స్థాయిలో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. బబుల్‌గమ్‌ సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. రవికాంత్‌ పేరేపు దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్‌ 29న విడుదల కానుంది. ఇప్పటికే తాను పోలీసులకు దొరికిపోయినట్లు ఓ ప్రాంక్‌ వీడియో చేసి సినిమా ప్రమోషన్స్‌ మొదలుపెట్టాడీ యంగ్‌ హీరో.

చిన్నప్పటి నుంచే కోరిక..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'చిన్నప్పటి నుంచి తెలియకుండానే యాక్టింగ్‌పై ఆసక్తి ఏర్పడింది. బాల్యంలో ఉన్నప్పుడు అమ్మతో కలిసి ఓ వాణిజ్య ప్రకటనలో నటించినప్పుడు చాలా సంతోషమేసింది. అలా చిన్నప్పుడే నటుడినవ్వాలని నా మనసులో బలంగా అనుకున్నాను. యాక్టింగ్‌ కోర్సు కూడా నేర్చుకున్నాను. ఒక మనసు సినిమాలో చిన్న పాత్ర చేశాను. నిర్మలా కాన్వెంట్‌ ఆడిషన్స్‌కు వెళ్లి సెలక్ట్‌ అయ్యాక అందులో ఓ పాత్ర చేశాను. బబుల్‌గమ్‌ సినిమా కూడా ఆడిషన్స్‌ జరిగాకే హీరోగా సెలక్ట్‌ చేశారు.

విడాకులు తీసుకుంటున్నారా? అని అడిగా
అమ్మానాన్న విడాకులు తీసుకుంటున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అవి చదుతున్నప్పుడు అమ్మానాన్న జాలీగా కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తున్నారు. అసలేం జరుగుతుందో అర్థం కాక.. ఏంటి? మీరు విడాకులు తీసుకుంటున్నారా? అని అడిగేశాను. దానికి వాళ్లు.. ఛీఛీ, ఏం మాట్లాడుతున్నావ్‌రా.. అలాంటిదేం లేదని చెప్పారు. రెండుమూడుసార్లు ఈ విడాకుల వార్తలు చూసినప్పుడు అంతా గందరగోళంగా అనిపించేది. తర్వాత ఊరికే పుకార్లు రాస్తున్నారని అర్థమైంది.

పేరెంట్స్‌ మధ్య గొడవలు?
నిజంగా అలాంటిదేమైనా ఉంటే ఇంట్లో ఉండే మాకు తెలుస్తుందిగా.. నాకు తెలియకుండా బయటవాళ్లకు ఈ వార్తలు వెళ్లడమేంటి? అనుకున్నాను. ఆ వార్తల్లో ఒక్క శాతం కూడా నిజం లేదు. భార్యాభర్తల మధ్య గొడవలుంటాయి. కానీ అమ్మానాన్న మధ్య అలాంటి పెద్ద గొడవలు ఏం జరగలేదు. పొద్దున త్వరగా నిద్ర లేకపోతే అమ్మ నాన్నపై అరుస్తుంటుంది. అలాంటి చిన్నచిన్న  సరదా గొడవలే ఉంటాయి' అని చెప్పుకొచ్చాడు రోషన్‌ కనకాల.

చదవండి: శివాజీ బ్యాచ్‌ని ఉతికారేసిన నాగార్జున.. ఆ విషయమే కారణమా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement