పోలీసులకు దొరికిపోయిన యాంకర్‌ సుమ తనయుడు, ఏమైందంటే? | Anchor Suma Son Roshan Was Caught By Telangana Police Video Viral, Know About Twist Inside The Car | Sakshi
Sakshi News home page

Roshan Kanakala: పోలీసులకు దొరికిపోయిన యాంకర్‌ సుమ తనయుడు. ఏం జరిగిందంటే?

Nov 16 2023 3:56 PM | Updated on Nov 16 2023 4:27 PM

Anchor Suma Son Roshan Was Caught By Telangana Police Video Viral, Know About Twist Inside The Car - Sakshi

ఎలక్షన్‌ డ్యూటీలో ఉన్న పోలీసులు రోషన్‌ కారును అడ్డుకున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? అని అడిగితే తలతిక్క సమాధానాలు చెప్పారు. చివరకు కారు డిక్కీ ఓపెన్‌ చేయించ

యాంకర్‌ సుమ తనయుడు రోషన్‌ కనకాల పోలీసులకు దొరికాడు. ఓ పార్టీకి తన స్నేహితులతో కలిసి కారులో వెళ్తున్న ఇతడిని పోలీసులు అడ్డుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందనుకుంటున్నారా? మరేం లేదు ప్రాంక్‌.. ఈ మధ్య రచ్చ చేయడం, చివర్లో అది తూచ్‌, ఉత్తుత్తే అనేయడం ఫ్యాషన్‌ అయిపోయింది. సినిమా వాళ్లయితే ఒక్కొక్కరు ఒక్కోలా తమ చిత్రాలకు పబ్లిసిటీ చేసుకుంటున్నారు. యాంకర్‌ సుమ తనయుడు రోషన్‌ కూడా ఇదే అనుసరించాడు.

వెరైటీ స్టంట్‌..
'బబుల్‌గమ్‌' సినిమాతో రోషన్‌ హీరోగా పరిచయం అవుతున్నాడు. మానస చౌదరి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు రవిక్రాంత్‌ దర్శకత్వం వహించాడు. ఆ మూవీ కోసం తాజాగా కొత్త రీతిలో ప్రమోషన్‌ చేశారు.. పోలీసులకు దొరికిపోయినట్లు ఓ స్కిట్‌ వేశారు. అందులో భాగంగా తన ఫ్రెండ్స్‌తో కలిసి జాలీగా కారులో వెళ్తున్న రోషన్‌ను ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. అసలే ఎన్నికల సమయంలో మద్యం, డబ్బు ఏరులై పారుతుంది.

కారు డిక్కీలో సూట్‌కేసులు..
వాటిని నియంత్రిచడం కోసం కార్లు, ఇతర వాహనాలను పోలీసులు చెక్‌ చేస్తూ ఉంటారు. అలా ఎలక్షన్‌ డ్యూటీలో ఉన్న పోలీసులు రోషన్‌ కారును అడ్డుకున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? అని అడిగితే రోషన్‌ స్నేహితులు తలతిక్క సమాధానాలు చెప్పారు. చివరకు కారు డిక్కీ ఓపెన్‌ చేయించగా అందులో సూట్‌కేసులు కనిపించాయి. అవి తెరవడానికి తటపటాయించడమే కాకుండా పోలీసులతోనే డీల్‌ కుదుర్చుకోవాలని చూశారు. కానీ పోలీసులు వినకుండా సూట్‌కేసులు ఓపెన్‌ చేయాల్సిందేనని పట్టుపట్టారు.

అప్పుడు సుమ.. ఇప్పుడు ఆమె తనయుడు..
చేసేదేం లేక సూట్‌కేసులు ఓపెన్‌ చేయగా వాటిలో స్వీట్లు ఉండటం చూసి పోలీసులు షాకవుతారు. అక్కడ జిలేబీలు, బబుల్‌ గమ్స్‌ ఉన్నాయి. అంటే మీకీపాటికే అర్థమై ఉంటుంది. ఇది బబుల్‌ గమ్‌ సినిమా కోసం చేసిన ప్రమోషనల్‌ స్టంట్‌ అని! ఇది చూసిన జనాలు.. మరీ ఇలాంటి స్టంట్లు అవసరమా? అని కామెంట్లు చేస్తున్నారు. అప్పుడేమో అల్లరి నరేశ్‌ ఉగ్రం రిలీజ్‌ సమయంలో యాంకర్‌ సుమను అరెస్ట్‌ చేసినట్లు నమ్మించి సినిమాకు కావాల్సినంత హైప్‌ తెచ్చుకున్నారు. ఇప్పుడేమో సుమ కుమారుడు పోలీసులకు దొరికినట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు. 

చదవండి: నెలసరి ఆలస్యం.. బిగ్‌బాస్‌ హౌస్‌లో కంటెస్టెంట్‌కు ప్రెగ్నెన్సీ టెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement