
యాంకర్ సుమ.. ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తన మాటల ప్రవాహంతో 15ఏళ్‌లుగా స్టార్ యాంకర్‌గా కొనసాగుతుందామె. టీవీ ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లు వస్తుంటారు.. పోతుంటారు. కానీ కానీ, యాంకర్ సుమ మాత్రం పర్మినెంట్. సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ అయినా.. టాక్ షోలైనా, గేమ్ షోలైనా సుమ ఉండాల్సిందే. పేరుకు మలయాళీ అయినా తెలుగులో గలగల మాట్లాడుతూ తన కామెడీ, పంచ్ టైమింగ్‌లతో ప్రేక్షకులకు బోలెడంత ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తోంది.
ఆమె లేకుండా స్టార్ హీరోల ప్రీ రిలీజ్ ఈవెంట్‌లు దాదాపు ఉండవని చెప్పాలి. అంతటి సామర్థ్యం ఉన్న సుమను తాజాగా అరెస్ట్ చేశారన్న వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో తెగ చక్కర్లు కొడుతుంది. ఆమె చేతికి బేడీలు వేసి వ్యాన్‌లో తీసుకెళ్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో సుమకి ఏమైంది? ఎందుకు అరెస్ట్ చేశారంటూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. అయితే సుమను నిజంగా అరెస్ట్ చేయలేదట.
ఓ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇలా అరెస్ట్ చేశారని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ మధ్యకాలంలో సినిమాల ప్రమోషన్స్ చాలా డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే అల్లరి నరేస్ నటిస్తున్న సినిమా ఉగ్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సుమతో ఇలా స్పెషల్ ఇంటర్వ్యూను ప్లాన్ చేసారన్నమాట.
CI Shiva Kumar on duty!
— Allari Naresh (@allarinaresh) April 12, 2023
Your favourite anchor is in my control.
The #Ugram begins.
Details at 5.04 PM. https://t.co/5aQDlhlNdN