
యాంకరింగ్‌లో సుమను ఢీ కొట్టేవారే లేరు. ప్రస్తుతం టాప్ యాంకర్లుగా రాణిస్తున్నవారు కూడా సుమ యాంకరింగ్‌కు ఫ్యాన్సే! పంచులు, కౌంటర్లు, జోక్స్లతో ప్రతి ఒక్కరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది సుమ. ఎంతటివారైనా ఆమె మాటల ప్రవాహంలో కొట్టుకుపోవాల్సిందే! అంతటి ధీశాలి సుమ అంటే ఆశ్చర్యపోనవసరం లేదు.
తాజాగా సుమ మదర్స్‌డే(మే 14)ను పురస్కరించుకుని తన తల్లి విమల కోసం ఏదైనా గిఫ్ట్ కొనేందుకు షాపింగ్ చేసింది. ఈ మేరకు ఓ వీడియోను తన సొంత యూట్యూబ్ ఛానల్‌లో రిలీజ్ చేసింది. ఇక్కడ కూడా తన చలాకీ మాటలతో అభిమానులను ఎంటర్‌టైన్ చేసింది చివరగా తన తల్లి కోసం ఒక సింపుల్ ఐటం సెలక్ట్ చేసుకున్నట్లు చెప్పింది. చివరగా.. అమ్మకు ఏమిచ్చినా సరిపోదు కాబట్టి వీటన్నిటితోపాటు బోలెడంత ప్రేమను కూడా ఇచ్చేయండి అని చెప్పుకొచ్చింది.
ఇకపోతే టాలీవుడ్‌లో జరిగే చిన్నాపెద్ద ఈవెంట్లకు సుమ ఉండాల్సిందే! ఏ కార్యక్రమాన్ని అయినా సక్సెస్‌ఫుల్ చేయడంలో సుమ దిట్ట. తను టీవీ షోలు, ఇంటర్వ్యూలే కాకుండా ప్రీరిలీజ్ ఈవెంట్లు కూడా చేస్తుందన్న విషయం తెలిసిందే! కెరీర్ తొలినాళ్లలో నటిగా కొన్ని సినిమాలు చేసిన సుమ ఇటీవల జయమ్మ పంచాయితీ సినిమాతో మెప్పించింది కూడా!
చదవండి: రూ.132 కోట్ల నష్టం.. భర్త కోమాలోకి.. మూడుసార్లు ఆత్మహత్య చేసుకుందామనుకున్నా
Comments
Please login to add a commentAdd a comment