యాంకర్ సుమ కనకాల అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరనడంలో అతిశయోక్తి లేదు. 15ఏళ్లుగా స్టార్ యాంకర్‌గా కొనసాగుతున్న సుమకు తెలుగు రాష్ట్రాల్లో బోలెడంత మంది అభిమానులు ఉన్నారు. స్టార్ హీరోల ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయినా, టాక్ షో అయినా సుమ ఉండాల్సిందే అనేంతగా క్రేజ్ దక్కించుకుంది. ఆమె పంచులు కామెడీ టైమింగ్‌కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.
అంతటి క్రేజ్ సంపాదించుకున్న సుమ తాజాగా అభిమానులకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఓ షోలో పాల్గొన్న సుమ తాను యాంకరింగ్‌కు బ్రేక్ ఇస్తున్నట్లు చెప్పి ఎమోషనల్ అయ్యింది. "నేను మలయాళీ అయినా తెలుగు ప్రేక్షకులు నన్ను గుండెల్లో పెట్టుకొని ప్రేమించారు" అంటూ సుమ కన్నీటి పర్యంతం అయ్యింది.
యాంకరింగ్ నుంచి విరామం తీసుకోబోతున్నట్లు స్వయంగా ప్రకటించడంతో మిగతా ఆర్టిస్టులు అందరూ ఆమెకు శాలువా కప్పి సన్మానం చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఏది ఏమైనా సుమ లేని టెలివిజన్ అంటే కాస్త కష్టమేనంటున్నారు ఆమె ఫ్యాన్స్.
Comments
Please login to add a commentAdd a comment