Anchor Suma Kanakala Marriage Anniversary Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Anchor Suma Kanakala: 'నువ్వక్కడ.. నేనిక్కడ..' సుమ పోస్ట్ వైరల్

Published Fri, Feb 10 2023 7:49 PM

Anchor Suma Kanakala Marriage Anniversery Goes Viral On Social Media - Sakshi

తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్‌ ఎవరంటే మొదట వినిపించే పేరు సుమ. అంతలా ఫేమ్ సంపాదించుకుంది కేరళ అమ్మాయి. ఇండస్ట్రీలో ఎంతో మంది యాంకర్లు వస్తుంటారు.. పోతుంటారు. కానీ సుమ మాత్రం లోకల్ అన్న విధంగా ఉంటుంది. ఏ ఈవెంట్‌ అయినా సరే సుమ ఉందంటే ఆ రేంజే వేరు. తెలుగమ్మాయి కాకపోయినా.. తెలుగులో గలగల మాట్లాడడం, సమాయానుకూలంగా పంచ్‌లు వేయడంలో ఆమెకు ఆమె సాటి. నటుడు రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకుని హైదరాబాద్‌లోనే స్థిరపడిపోయింది. 

ఇక టాలీవుడ్‌లో రాజీవ్ కనకాల గురించి పరిచయం అక్కర్లేదు. ఏ పాత్రలోనైనా మెప్పించడం ఆయనతే సొంతం. ఇక వీరిద్దరి ప్రేమ పెళ్లి సంగతులు అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. పెళ్లయి వీరికి 24 ఏళ్లు పూర్తయింది. వివాహా వార్షికోత్సావాన్ని కాస్త భిన్నంగా సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను సుమ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ పెడుతున్నారు. 

సుమ షేర్ చేసిన ఆ వీడియో కాల్‌లో ఇద్దరు పాట పాడుతూ ప్రత్యేక రోజును సెలబ్రేట్ చేసుకున్నారు. నువ్వక్కడ.. నేనిక్కడ.. పాటక్కడ.. పలుకిక్కడ అంటూ సుమ పాట పాడగా.. మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా' అంటూ రాజీవ్ కనకాల పాడుతూ వీడియో కాల్‌లో కనిపించారు. ఏదేమైనా సుమక్క యాంకరింగే కాదు.. ఇలా వెరైటీగా సెలబ్రేట్ చేసుకుని అందరినీ ఆశ్చర్యానికీ గురి చేసింది. 

Advertisement
 
Advertisement
 
Advertisement