Anchor Suma Kanakala opens up on Quitting Anchoring - Sakshi
Sakshi News home page

Anchor Suma: కంగారుపడొద్దు, నేనెక్కడికీ వెళ్లడం లేదు

Published Wed, Dec 28 2022 12:01 PM | Last Updated on Wed, Dec 28 2022 12:47 PM

Anchor Suma Kanakala Open up On Quitting Anchoring - Sakshi

తెలుగు బుల్లితెర టాప్‌ యాంకర్‌ ఎవరని అడిగితే సుమ కనకాల అని టపీమని చెప్తారు. 15 ఏళ్లుగా స్టార్‌ యాంకర్‌గా కొనసాగుతుందామె. టీవీ ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లు వచ్చినా ఎవ్వరూ ఆమె స్థానాన్ని పొందడం కాదు కదా దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు. ఆ రేంజ్‌లో క్రేజ్‌ సంపాదించుకుంది సుమ. టీవీ షోలే కాదు, ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లు, ఇంటర్వ్యూలు.. ఏదైనా సరే సుమ ఉండాల్సిందే.. ఆమె మలయాళీ అయినా పదహారణాల తెలుగమ్మాయిగా రెడీ అయి అచ్చ తెలుగులో అనర్గళంగా మాట్లాడే సామర్థ్యం ఆమెది. తన కామెడీ, పంచ్‌ టైమింగ్‌లకు కొదవే లేదు. తాజాగా ఆమె యాంకరింగ్‌కు బ్రేక్‌ ఇస్తున్నట్లు వార్తలు వైరల్‌ అయ్యాయి. దీనిపై సుమ స్పందించింది.

'ఇటీవల న్యూఇయర్‌ ఈవెంట్‌ చేశాం. ఆ ప్రోమో రిలీజ్‌ చేయగా అది సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ అవుతోంది. అందులో నేను కొంత ఎమోషనలైన మాట వాస్తవమే. కానీ ఈవెంట్‌ అంతా చూస్తే అసలు విషయం ఏంటో మీకు అర్థమవుతుంది. చాలామంది ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్‌లు పెడుతున్నారు.. ఏం కంగారుపడకండి. నేను టీవీ కోసమే పుట్టాను, ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసమే పుట్టాను. ఎక్కడికీ వెళ్లడం లేదు. కాబట్టి మీరు హాయిగా ఉండండి' అని ఓ వీడియో రిలీజ్‌ చేసింది సుమ.

చదవండి: తొలి సంపాదన రూ.350:  భరత్‌
ధమాకా.. కలెక్షన్స్‌ ఎంతంటే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement