'కోర్టు' సినిమా కలెక్షన్లు‌.. 'నాని'కి భారీ లాభాలు | Nani Produced Court Movie Day 1 Collection | Sakshi
Sakshi News home page

'కోర్టు' సినిమా కలెక్షన్లు‌.. 'నాని'కి భారీ లాభాలు

Published Sat, Mar 15 2025 11:16 AM | Last Updated on Sat, Mar 15 2025 11:18 AM

Nani Produced Court Movie Day 1 Collection

హీరో నాని నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం ‘కోర్ట్‌’–స్టేట్‌ వర్సెస్‌ ఏ నోబడీ’ బాక్సాఫీస్‌ వద్ద హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో రోషన్, శ్రీదేవి ఇతర పాత్రల్లో నటించారు. ఇందులో  శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్ష వర్ధన్‌ తదితరులు కీలకంగా మెప్పించారు. మార్చి 14న హోలీ పండగ సందర్భంగా ఈ చిత్రం విడుదలైంది. రామ్‌ జగదీష్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు తొలిరోజే భారీ రెస్పాన్స్‌ వచ్చింది. ఈమేరకు భారీ కలెక్షన్లను రాబట్టి రికార్డ్స్‌ క్రియేట్‌ చేసింది.

కోర్టు సినిమా ప్రీమియర్‌ షోలతో కలుపుకొని మొదటిరోజు రూ. 8.10 కోట్లు రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం అతని కెరీర్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. సుమారు రూ. 11 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నాని నిర్మించారని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొదటిరోజు బ్రేక్‌ఈవెన్‌కు దగ్గరలో కోర్టు కలెక్షన్లు రావడంతో అభిమానులు సంతోషిస్తున్నారు. ఈ వీకెండ్‌లో భారీగా కలెక్షన్లు పెరిగే ఛాన్స్‌ ఉంది. సులువుగా ఈ వారంలోనే రూ. 20 కోట్ల మార్క్‌ను ఈ చిత్రం అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. 

ఇప్పటికే ఓటీటీ రైట్స్ ద్వారా రూ. 8 కోట్లు, ఆడియో ద్వారా రూ. 50 లక్షలు, శాటిలైట్ ద్వారా మరో రెండు కోట్లు ఈ చిత్రానికి వచ్చాయని అంచనా వేస్తున్నారు. కోర్టు సినిమా భారీ లాభాలు తెచ్చిపెడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రాన్ని నిర్మించిన హీరో నానిపై విమర్శకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.

(ఇదీ చదవండి- Court Movie Review: కోర్టు సినిమా రివ్యూ)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement