పెళ్లి చూపుల సినిమాతో ఒక్కసారిగా అందరిని దృష్టిని ఆకర్షించాడు నటుడ ప్రియదర్శి. ఈ సినిమాలో నా చావు నేను చస్తా నీకెందుకు అనే డైలాగ్ ప్రేక్షకులను కడుబ్బా నవ్వించాడు. ఈ డైలాగ్ అతడు రాత్రి రాత్రే ప్రయదర్శి స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ది ఘాజి ఎటాక్, అర్జున్ రెడ్డి, జై లవకుశ, జాతి రత్నాలు, రాధే శ్యామ్, సీతారామం, ఒకే ఒక జీవితం వంటి సినిమాల్లో నటించాడు. కమెడియన్‌గా, నటుడి వరుస ఆఫర్లు అందుకుంటున్నాడు.
చదవండి: నన్ను అలా అనడంతో మేకప్ రూంకి వెళ్లి ఏడ్చా: నటి ప్రగతి
అలాగే మల్లేశం సినిమాలో లీడ్ రోల్ పోషించిన ప్రియదర్శి తన అద్భుతమైన నటనతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. కేవలం సినిమాల్లోనే కాదు పలు వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తూ కెరీర్‌లో దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ఓ టాక్‌లో షో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా తన కెరీర్, మూవీస్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఈ మేరకు ప్రియదర్శి మాట్లాడుతూ.. టెర్రర్ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చానని చెప్పాడు. సినిమాటోగ్రాఫ్ అవుతానని ఇంట్లో చెప్పి వచ్చాననన్నాడు.
చదవండి: దీపావళి సందర్భంగా కాబోయే భర్తను పరిచయం చేసిన హీరోయిన్
అయితే ఇక్కడికి వచ్చాక నటుడిగా ఆడిషన్స్ ఇస్తున్న క్రమంలో తనని ఘెరంగా అవమానించేవారంటూ చేదు సంఘటనలను గుర్తు చేసుకున్నాడు. ‘ఆడిషన్స్‌కి వెళ్లినప్పుడు నల్లగా, సన్నగా ఉన్నానంటూ విమర్శించేవారు. కొన్ని సార్లు హీరో కంటే పొడుగ్గా ఉన్నానని కూడా నన్ను రిజెక్ట్ చేశారు. కానీ అవేవి నేను పట్టించుకోలేదు. ఆ సమయంలో టెర్రర్‌లో ఓ పాత్రకు నేనే సరిగ్గా సరిపోతానని వారే నాకు ఫోన్ చేశారు’ అని చెప్పుకొచ్చాడు. కాగా పెళ్లి చూపులు సినిమాకి గానూ ఉత్తమ హాస్యనటుడిగా ప్రియదర్శి సైమా, ఐఫా అవార్డులు అందుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment