సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వం వహించిన రెండో చిత్రం ‘‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ (ఎవరు, ఎక్కడ, ఎందుకు). అదిత్ అరుణ్, శివానీ రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా రామంత్ర క్రియేషన్స్ పతాకంపై డా. రవి పి.రాజు ధాట్ల తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. శుక్రవారం హీరోయిన్ తమన్నా ఈ సినిమాలోని 'నైలూ నది' అనే పాటను రిలీజ్ చేశారు. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో వైవా హర్ష, ప్రియదర్శి, దివ్య శ్రీపాద కీలక పాత్రలు పోషించారు. (డియర్ కామ్రేడ్ నా ఫస్ట్ సినిమా అయ్యుండేది)
ఇప్పటికే రిలీజైన ఈ చిత్రం టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 55 సెకన్ల నిడివి గల టీజర్‌లో సినిమా ఎలా ఉండబోతుందో చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. టాలీవుడ్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కెమెరా మెన్‌గా పని చేసిన గుహన్ మెగా ఫోన్ పట్టుకుని చేసిన మొదటి సినిమా 118. కళ్యాణ్ రాం హీరోగా తెరకెక్కిన ఆ సినిమా మంచి ఫలితాన్ని అందుకుంది.ఈ చిత్రానికి సిమాన్ కే కింగ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా.. డాక్టర్ రవి పీ రాజు దట్ల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. (చిన్నప్పటి మహేంద్ర బాహుబలి ఇప్పుడెలా ఉందో చూడండి..)
Team #WWWMovie Thanks @tamannaahspeaks for launching
— BARaju (@baraju_SuperHit) January 29, 2021
Melodious #NailuNadi Telugu song 💕
ICYMI, ▶️https://t.co/6reYS6uMoi
🎵 @simonkking
✍️ @ramjowrites
🎤 @sidsriram@kvguhan @AdithOfficial @Rshivani_1 @RamantraCreate @DrRaviPRaju @VijayDharan_D @baraju_SuperHit @adityamusic pic.twitter.com/DactvRXdyT
Comments
Please login to add a commentAdd a comment