కెమిస్ట్రీ కుదిరింది | Anjali an Lakshmi Rai look hot in Ananda Bhairavi | Sakshi
Sakshi News home page

కెమిస్ట్రీ కుదిరింది

Published Fri, Jun 14 2019 12:44 AM | Last Updated on Fri, Jun 14 2019 12:44 AM

Anjali an Lakshmi Rai look hot in Ananda Bhairavi - Sakshi

అంజలి

అంజలి, లక్ష్మీరాయ్‌ ప్రధాన పాత్రల్లో ఆదిత్‌ అరుణ్‌ ప్రత్యేక పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆనంద భైరవి’. కర్రీ బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. హరివేన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై ఇటికేల రమేష్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ వైజాగ్‌ పరిసర ప్రాంతాల్లో పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా  కర్రి బాలాజీ మాట్లాడుతూ– ‘‘ఆనందిని పాత్రలో అంజలి ఒదిగిపోయారు. ఆ పాత్ర కోసం చాలా స్లిమ్‌ అయ్యారు. ఒక మధ్యతరగతి అమ్మాయి పాత్రలో తన హావభావాల్ని ప్రదర్శిస్తున్నప్పుడు ఆశ్చర్యపోయా.

ఆ పాత్ర కోసం స్కూటీ రైడ్‌ చేస్తున్న సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు స్కూటీ మీదనుంచి పడటంతో ఆమెకు గాయాలయ్యాయి. అయినా షూటింగ్‌లో పాల్గొన్నారు. సెకండ్‌ షెడ్యూల్‌లో లక్ష్మీరాయ్‌పై యాక్షన్‌ సీన్స్‌ చిత్రీకరిస్తాం’’ అన్నారు. ‘‘అందమైన విశాఖపట్నంలో అంజలి, ఆదిత్‌ అరుణ్‌లపై కర్రి బాలాజీ చిత్రీకరించిన ప్రేమ సన్నివేశాలు ఆహ్లాదకరంగా ఉన్నాయి. పృథ్వీ, బ్రహ్మాజీ, గుండు సుదర్శన్, జయవాణిలపై చిత్రీకరించిన కామెడీ సన్నివేశాలు బాగా వచ్చాయి. తర్వాతి షెడ్యూల్‌ని హైదరాబాద్‌  పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తాం’’ అని ఇటికేల రమేష్‌ రెడ్డి అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సురేష్‌ దత్తి, కెమెరా: పీజీ విందా, సంగీతం: మణిశర్మ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement