‘‘రామ్‌గోపాల్ వర్మ ‘రక్త చరిత్ర’, ‘వంగవీటి’ చిత్రాలు బయోపిక్స్ క్యారెక్టర్ ఓరియంటెడ్‌గా ఉంటాయి. ‘కొండా’ మూవీ బయోఫిక్షన్.. ఇందులో కొండా మురళి, సురేఖ జీవితంలో జరిగిన ఘటనలను తీసుకుని కల్పిత కథ రాశారు. బయోపిక్, బయోఫిక్షన్ చిత్రాల మధ్య వ్యత్యాసం ఉంది’’ అని హీరో త్రిగుణ్ అన్నారు. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో త్రిగుణ్, ఇర్రా మోర్ జంటగా నటించిన చిత్రం ‘కొండా’. శ్రేష్ఠ పటేల్ మూవీస్ సమర్పణలో కొండా సుష్మితా పటేల్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న రిలీజ్ అవుతోంది.
ఈ సందర్భంగా త్రిగుణ్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘కొండా’ సినిమా కోసం దాదాపు ఏడు కేజీల బరువు పెరిగాను. అప్పటి కాలేజీ రాజకీయాలు ఈ చిత్రంలో ఉంటాయి. ఎమోషనల్‌గా కూడా ఈ సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది. ఇక నేను నటించిన ‘ప్రేమ దేశం’, ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. దేవా కట్టా శిష్యుడు సురేష్ దర్శకత్వంలో ఒక సినిమా, మిస్కిన్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాను. రాక్‌లైన్ వారి కొత్త బ్యానర్ ‘పర్పుల్ రాక్’లో ‘లైన్‌మేన్’, ‘కిరాయి’ అనే సినిమాలు చేస్తున్నాను’’ అని త్రిగుణ్ తెలిపారు.
చదవండి: దేవుడిచ్చిన లోపాన్ని కూడా సరిచేసే తల్లి కథ..
లారెన్స్ బిష్ణోయ్ ముఠా హిట్ లిస్ట్‌లో కరణ్ జోహార్..
వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్
మరో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్ హీరో నరేష్ !
Comments
Please login to add a commentAdd a comment