Kondaa Movie
-
Kondaa Movie: నక్సల్ లీడర్ ఆర్కే గా ప్రశాంత్ కార్తీ!
కొండా మురళి, కొండా సురేఖ జీవిత చరిత్ర ఆధారంగా రామ్ గోపాల్ వర్మ తెరెక్కించిన చిత్రం ‘కొండా’. కొండా సుస్మిత పటేల్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా లో త్రిగుణ్ కొండా మురళి గా నటిస్తున్నారు. జూన్ 23 వ తేదీన ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమా లో నటుడు ప్రశాంత్ కార్తీ ఓ కీలక పాత్రలో నటించారు. అంతకుముందు ప్రశాంత్ కార్తీ పలు సినిమాల్లో నటించి గుర్తింపు దక్కించుకోగా ఈ సినిమాలో కీలక పాత్ర అయిన నక్సల్ లీడర్ ఆర్కే గా ఆయన కనిపించనున్నాడు. ఈ పాత్ర గురించి సినిమా విశేషాల గురించి ప్రశాంత్ కార్తీ మాట్లాడుతూ.. ‘కొండా సినిమా లో ఒక పవర్ ఫుల్ పాత్రలో నటించాను. ఇప్పటివరకు నా కెరీర్ లో చేసిన పాత్రల్లో ఆర్కే పాత్ర ఎంతో ముఖ్యమైంది. ఇంతటి మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. ఆర్కే యొక్క విప్లవాత్మక ఆలోచనలు,నాకు చాలా స్ఫూర్తినిచ్చాయి. ఆయనలా కనిపించడానికి ప్రత్యేక సాధన చేశాను. తప్పకుండా అందరూ మెచ్చుకునేలా నా పాత్ర ఉంటుంది. అందరు అలరింపబడే విధంగా ఈ సినిమా ఉంటుంది’అని అన్నారు. -
అందుకోసం ఏడు కేజీల బరువు పెరిగాను: హీరో
‘‘రామ్‌గోపాల్ వర్మ ‘రక్త చరిత్ర’, ‘వంగవీటి’ చిత్రాలు బయోపిక్స్ క్యారెక్టర్ ఓరియంటెడ్‌గా ఉంటాయి. ‘కొండా’ మూవీ బయోఫిక్షన్.. ఇందులో కొండా మురళి, సురేఖ జీవితంలో జరిగిన ఘటనలను తీసుకుని కల్పిత కథ రాశారు. బయోపిక్, బయోఫిక్షన్ చిత్రాల మధ్య వ్యత్యాసం ఉంది’’ అని హీరో త్రిగుణ్ అన్నారు. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో త్రిగుణ్, ఇర్రా మోర్ జంటగా నటించిన చిత్రం ‘కొండా’. శ్రేష్ఠ పటేల్ మూవీస్ సమర్పణలో కొండా సుష్మితా పటేల్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా త్రిగుణ్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘కొండా’ సినిమా కోసం దాదాపు ఏడు కేజీల బరువు పెరిగాను. అప్పటి కాలేజీ రాజకీయాలు ఈ చిత్రంలో ఉంటాయి. ఎమోషనల్‌గా కూడా ఈ సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది. ఇక నేను నటించిన ‘ప్రేమ దేశం’, ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. దేవా కట్టా శిష్యుడు సురేష్ దర్శకత్వంలో ఒక సినిమా, మిస్కిన్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాను. రాక్‌లైన్ వారి కొత్త బ్యానర్ ‘పర్పుల్ రాక్’లో ‘లైన్‌మేన్’, ‘కిరాయి’ అనే సినిమాలు చేస్తున్నాను’’ అని త్రిగుణ్ తెలిపారు. చదవండి: దేవుడిచ్చిన లోపాన్ని కూడా సరిచేసే తల్లి కథ.. లారెన్స్ బిష్ణోయ్ ముఠా హిట్ లిస్ట్‌లో కరణ్ జోహార్.. వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్ మరో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్ హీరో నరేష్ ! -
‘కొండా' సినిమా ప్రీరిలీజ్ వేడుక (ఫొటోలు)
-
సాయి పల్లవికి రెడ్కార్పె ట్ వేసి.. రేవంత్‌రెడ్డి ఆపారు : సుష్మితాపటేల్ ఫైర్
సాక్షి, హన్మకొండ అర్బన్: ‘చదువురానోడికి మంత్రి పదవి ఉన్నది కాబట్టి సినిమా ఫంక్షన్ వేడుకలకు అనుమతి ఇవ్వలేదు. అదే చదువుకున్న కడియం శ్రీహరి మంత్రిగా ఉంటే అనుమతి వచ్చేది’ అని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నాయకుడు కొండా మురళి అన్నారు. కొండా మురళి, సురేఖ దంపతుల జీవితకథ ఆధారంగా దర్శకుడు ఆర్జీవీ నిర్మించిన కొండా సినిమా ప్రీరిలీజ్ వేడుకను శనివారం రాత్రి హనుమకొండలో నిర్వహించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ ఆ చదువు రానోడి పేరు చెప్పనని, అతని గురించి సినిమాలో ఆర్జీవీ బాగా చూపించాడన్నారు. మురళి ఒక్కసారి మాట ఇచ్చాడంటే మెడ కోసుకుంటాడన్నారు. (చదవండి: గద్దర్ పాటకి ఆర్జీవీ స్టెప్పులు.. వీడియో వైరల్) సురేఖ మాట్లాడుతూ దౌర్జన్యాలు చేసే ప్రభుత్వాలను గద్దెదించాలని, అందుకు ఈ సినిమా స్ఫూర్తిగా ముందుకు సాగాలన్నారు. అణచి వేతలనుంచి పైకివచ్చామని, కష్టాలు తెలిసిన వారిగా ఎప్పుడూ అండగా ఉంటామని అన్నారు. సినిమా నిర్మాత, కొండా దంపతుల కుమార్తె సుస్మితాపటేల్ మాట్లాడుతూ ‘ఎర్రబెల్లి దయాకర్‌రావు నీ బతుకుమారదా..? నీ బతుకంతా భయంతోనేనా ... సాయి పల్లవికి రెడ్కార్పె ట్ వేశావు, నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేవత్‌రెడ్డి వస్తుంటే భయపడి ఆపేశావు. ఇంకా ఎంతకాలం భయపడతావు.. ఎన్నికలు రానియ్ నీ సంగతి చెబుతా’ అంటూ ఫైర్ అయ్యారు. రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. ‘కొండా మురళి, సురేఖ జీవించిన జీవితాన్ని రెండు గంటల్లో నాకు వీలైనంత బాగా సినిమా తీయడానికి ప్రయత్నించా. నేను ఆశించిన దానికంటే త్రిగుణ్ ఎక్కువ చేశాడు. ఇర్రా మోర్ అద్భుతంగా నటించింది. అభిలాష్ మెయిన్ విలన్ రోల్ చేశాడు. భవిష్యత్తులో మరిన్ని సినిమాల్లో అతడిని చూస్తారు. 'గాయం'లో 'చెలి మీద చిటికెడు దయ రాదా...' అని రొమాంటిక్ సాంగ్ తీశా. ఊర్మిళపై తీసిన ఆ పాటకు సుచిత్ర గారు కొరియోగ్రఫీ చేశారు. అప్పట్నుంచి మా ప్రయాణం కొనసాగుతోంది. గొప్ప గేయ రచయితల్లో ఒకరైన చంద్రబోస్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆయన 'సురేఖమ్మ' పాట రాశారు. సుచిత్ర 'తెలంగాణ పోరి' పాటకు కొరియోగ్రఫీ చేశారు. గద్దర్ పాటలు కొన్ని తీసుకున్నాం. డి.ఎస్.ఆర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు' అని అన్నారు. చిత్రంలో కొండా మురళి పాత్రలో త్రిగుణ్, సురేఖ పాత్రలో ఈరామోర్ నటించారు. ఈ సినిమాకు సుస్మితాపటేల్ నిర్మాతగా ఉండగా, శ్రేష్టపటేల్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. సుమ కనకాల యాంకర్‌గా వ్యవహరించారు. ఉమ్మడి జిల్లానుంచి కొండా అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వేడుకలో దర్శకుడు ఆర్జీవీ, సినిమా తారాగణం పాల్గొన్నారు. -
గద్దర్ పాటకి ఆర్జీవీ స్టెప్పులు .. వీడియో వైరల్
సినిమా ప్రమోషన్ విషయంలో నలుగురు నడిచే దారిలో కాకుండా.. కాస్త భిన్నంగా వ్యవహరించడం ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అలవాటు. ఆయన తన సినిమాని ప్రమోట్ చేసుకోవడం కోసం రకరకాల పాట్లు పడతాడు. ఏదో ఒకటి చేసి మొత్తానికి సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. తాజాగా తన కొత్త సినిమా ‘కొండా’ ప్రమోషన్స్ కోసం ఏకండా స్టేజ్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఆర్జీవి. (చదవండి: మీరు లేకుండా నేను లేను నాన్నా..మహేశ్‌బాబు ఎమోషనల్ పోస్ట్) కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందిన సినిమా 'కొండా'. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించారు. కొండా మురళి పాత్రలో త్రిగుణ్, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటించారు. శ్రేష్ఠ పటేల్ మూవీస్ పతాకంపై సినిమా రూపొందింది. కొండా సుష్మితా పటేల్ నిర్మించారు. జూన్ 23న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం వరంగల్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు.ఈ ఈవెంట్లో ఆర్జీవి తొలిసారి స్టేజ్‌పై డాన్స్ చేశాడు. గద్దరన్న పాటకు తనదైన శైలీలో స్టెప్పులేసి మెప్పించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
ఏ నటికి అయినా సరే ఆమెలా ఉండటం కష్టం : హీరోయిన్
‘కొండా సురేఖ వెరీ స్ట్రాంగ్ లేడీ. జీవితంలో ఆవిడ ఎన్నో మంచి పనులు చేశారు. ఆవిడ కఠిన పరిస్థితులను తట్టుకుని నిలబడ్డారు. నా జీవితం ఇప్పుడే మొదలైంది. మా ఇద్దరికీ చాలా వ్యత్యాసం ఉంది. ఆవిడతో కంపేర్ చేసుకోలేను. మా మధ్య ఉన్న ఒక్క కామన్ పాయింట్ ఏంటంటే... నేను కూడా స్ట్రాంగ్. భయపడకూడదని నా తల్లిదండ్రులు చెప్పారు’అని హీరోయిన్ ఇర్రా మోర్ అన్నారు. కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆదారంగా తెరకెక్కిన చిత్రం ‘కొండా’. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కొండా మురళిగా త్రిగుణ్, సురేఖగా ఇర్రా మోర్ నటించారు.శ్రేష్ఠ పటేల్ మూవీస్ పతాకంపై కొండా సుష్మితా పటేల్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 23న విడుదల కానుంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా గురువారం హీరోయిన్ ఇర్రా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. అలా ‘కొండా’లో అవకాశం రామ్‌గోపాల్ వర్మ్ శిష్యుడు సిద్దార్థ్ తెరకెక్కించిన 'భైరవగీత’ చిత్రంతో నా సినీ కెరీర్ స్టార్ట్ అయింది. ఈ చిత్రం తర్వాత రెండు వెబ్ సిరీస్‌లు చేశా. లాక్డౌన్లో ఉండగా వర్మ గారు 'కొండా' సినిమా స్క్రిప్ట్ పంపారు. నాకు సురేఖమ్మ పాత్ర బాగా నచ్చింది. కాలేజీ జీవితం నుంచి రాజకీయ ప్రయాణం వరకూ ఆమె జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. నటిగా ఫెర్ఫార్మన్స్‌కు స్కోప్ ఉన్న రోల్. అందులో నటించగలనని వర్మగారు అనుకోవడం నా అదృష్టం. కాపీ చేయలేదు.. నా శైలీలో నటించా ‘కొండా’మూవీ స్క్రిప్ట్ చదివాక... యూట్యూబ్‌లో ఆమె వీడియోస్ చూశా. లాక్డౌన్ కారణంగా అప్పట్లో సురేఖమ్మతో మాట్లాడటం కుదరలేదు. ఆ తర్వాత మా ఇంట్లో లుక్ టెస్ట్ చేశా. శారీ కట్టుకుని చూశా. ఆమె రాజకీయ నాయకురాలు కూడా.. అందువల్ల, ఎటువంటి దుస్తులు వేసుకోవాలి? ఏవి వేసుకోకూడదు? అని డిస్కస్ చేసుకున్నాం. వర్మ గారితో మాట్లాడి సురేఖమ్మ గురించి తెలుసుకున్నా. ఆ తర్వాత ఆమెతో మాట్లాడాను. ముఖ్యంగా ఇంటర్వ్యూల్లో ఎలా మాట్లాడేవారు? అనేది చూశా. ఆవిడను కాపీ చేయాలనుకోలేదు. నా శైలిలో నటించా. కానీ, ఆవిడ వ్యక్తిత్వం పాత్రలో కనిపించేలా చూసుకున్నా. అది వర్మకు బాగా తెలుసు కొండా కంటే ముందే వర్మ ప్రొడక్షన్ హౌస్‌లో 'భైరవగీత' చేశాను. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో నటించా. ప్రతి సన్నివేశాన్ని ఆయన దగ్గరుండి తీశారు. నటీనటుల నుంచి ఏం తీసుకోవాలో ఆయనకు బాగా తెలుసు. వెరీ క్లియర్. అలాగే, ఆయన మేకింగ్ ఫాస్ట్‌గా ఉంటుంది. త్రిగుణ్ చాలా మంచి నటుడు.చాలా ఈజీగా పాత్రలోకి వెళతాడు. వెంటనే బయటకు వస్తారు. యాక్టింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాడు. సెట్లో సీరియస్‌గా ఉంటాడు. కానీ, బయట సరదాగా ఉంటాడు. ఆమెలా ఉండటం కష్టం బయోపిక్ అంటే ఈ ప్రపంచంలో ఉన్న మనిషి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించడం. మనం లుక్స్ పరంగా మార్పులు చేయవచ్చు. మనిషిని పోలిన మనిషిని తీసుకు రావడం కష్టం కదా! అయితే... క్యారెక్టర్ పరంగా ఎటువంటి మార్పులు చేయలేం. అందువల్ల, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సురేఖమ్మ పబ్లిక్‌లో ఉన్న మనిషి. రాజకీయాల్లో ఉన్నారు. ఆమెకు ఓ ఇమేజ్ ఉంది. ఏ నటికి అయినా సరే ఆమెలా ఉండటం కష్టం. అయితే, సురేఖమ్మలా నటించి ప్రజల చేత గౌరవం సంపాదించుకోవడం ముఖ్యం. సినిమా చూశాక... ప్రేక్షకులు నన్ను గౌరవిస్తారని ఆశిస్తున్నాను. సురేఖమ్మ పాత్రకు వెయ్యి శాతం న్యాయం చేశావని మెచ్చుకున్నారు సురేఖమ్మ గారి అమ్మాయి సుష్మిత మా సినిమా ప్రొడ్యూసర్. ఆవిడను నేను ముందు కలవలేదు. ఒక నెల షూటింగ్ చేశాం. ఆ తర్వాత ఆవిడ రషెస్ చూశారు. ఫోన్ చేశారు. ఇంటర్వెల్ బ్లాక్‌లో కొండా మురళి గారిని షూట్ చేసే సన్నివేశం వస్తుంది. నిజంగా జరిగినప్పుడు సుష్మిత ఆయన దగ్గర ఉన్నారు. సినిమా స్టార్ట్ చేసే ముందు నేను ముంబై నుంచి వచ్చిన అమ్మాయిని కాబట్టి ఎలా యాక్ట్ చేస్తానోనని అనుకున్నారట. ఇంటర్వెల్ సీన్ చూశాక మెచ్చుకున్నారు. సురేఖమ్మ పాత్రకు వెయ్యి శాతం న్యాయం చేశానని చెప్పారు.'కొండా' షూటింగ్ చేసేటప్పుడు వరంగల్‌లోని మురళి - సురేఖమ్మ గారి గెస్ట్ హౌస్‌లో ఉన్నాం. వాళ్ళ ఫ్యామిలీతో చాలా కలిసిపోయాం. -
వాళ్లను విశ్లేషించడం మూర్ఖత్వం!
‘‘నాకు తెలిసిన ఓ రిటైర్డ్ పోలీసాఫీసర్ కొండా మురళిగారి గురించి చెప్పారు. ఆ తర్వాత మాజీ నక్సలైట్లతో మాట్లాడాను. కథ ఒక కొలిక్కి వచ్చాక కొండా ఫ్యామిలీని కలిసి, సినిమా గురించి చెబితే వారు ఒప్పుకున్నారు’’ అని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అన్నారు. కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘కొండా’. త్రిగుణ్, ఇర్రా మోర్ జంటగా నటించారు. శ్రేష్ఠ పటేల్ మూవీస్ సమర్పణలో ఆపిల్ ట్రీ, ఆర్జీవీ ప్రొడక్షన్‌పై కొండా సుష్మితా పటేల్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘కొండా మురళి, సురేఖల కాలేజీ జీవితం నుంచి రాజకీయ రంగ ప్రవేశం వరకు (1990 నుంచి 2000) ఈ సినిమా ఉంటుంది. కొండా దంపతుల కుమార్తె సుష్మిత ఈ చిత్రనిర్మాత కాబట్టి వాళ్లకు పాజిటివ్‌గా తీయలేదు.. తను నిర్మాత కాకున్నా నేను అనుకున్నది తీసేవాణ్ణి. ప్రస్తుతం ‘లడకీ’ అనే ఓ హిందీ చిత్రం తీశాను. అమితాబ్ బచ్చన్‌గారితో ఓ హారర్ సినిమా ప్లాన్ చేస్తున్నాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘పరిస్థితులు ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండవు. మనం చేసేది మనం చేస్తాం.. పరిస్థితులు ఇంకోటి చేస్తాయి. నాలుగు నెలల క్రితం ‘సినిమా టికెట్ రేట్లు తగ్గించి సినిమాలను చంపేస్తున్నారు’ అన్నారు. ఆ తర్వాత రేట్లు పెంచారు. ఇప్పుడు మళ్లీ తగ్గించారు. పరిస్థితులను బట్టి మారాల్సి వస్తుంది. ప్రేక్షకుడిని, ఎన్నికల్లో ఓటు వేసేవాళ్లను విశ్లేషించడమంత మూర్ఖపు పని ఇంకొకటి ఉండదు’’ అన్నారు రామ్‌గోపాల్ వర్మ. -
కేసీఆర్ బయోపిక్‌పై ఆలోచన ఉంది.. కానీ: రామ్ గోపాల్ వర్మ
Ram Gopal Varma About KCR Biopic In Kondaa Movie Trailer Launch 2022: ‘‘నేను విజయవాడలో చదువుకున్నాను. విజయవాడ రౌడీయిజం, రాయలసీమ ఫ్యాక్షనిజం మీద సినిమాలు చేశాను. అయితే తెలంగాణ గురించి నాకు పెద్దగా తెలియదు. కానీ కొండా మురళి, కొండా సురేఖల గురించి తెలుసుకున్నప్పుడు వీరిపై సినిమా తీయాలనిపించి వారిని అడిగాను. తన తల్లిదండ్రుల జీవితాల ఆధారంగా సినిమా కాబట్టి నిర్మాతగా ఉంటానని సుష్మిత అడిగారు. కొండా మురళి, కొండా సురేఖల జీవితాల్లో చాలా విషయాలు ఉన్నప్పటికీ కొంత భాగాన్ని మాత్రమే నేను సినిమాలో చూపించే ప్రయత్నం చేశాను. నేను ఏ బయోపిక్ తీసినా ఉన్నది లేనట్లుగా.. లేనిది ఉన్నట్లుగా చూపించను. ‘కొండా’ (Kondaa Movie) రెస్పాన్స్‌ను బట్టి ప్రీక్వెల్, సీక్వెల్ ప్లాన్ చేస్తాను. కేసీఆర్‌గారి బయోపిక్ (KCR Biopic) ఆలోచన ఉంది కానీ ఎప్పుడో చెప్పలేను’’ అన్నారు రామ్‌గోపాల్ వర్మ. కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవితం ఆధారంగా రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘కొండా’. కొండా మురళి పాత్రలో త్రిగుణ్ (అదిత్ అరుణ్), కొండా సురేఖ పాత్రలో ఐరా మోర్ నటించారు. కొండా సుష్మితా పటేల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ సినిమా కొత్త ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అనంతరం కొండా సుష్మిత మాట్లాడుతూ.. ‘‘రాజకీయ ప్రయోజనాల కోసం ‘కొండా’ సినిమా తీయలేదు. సినిమా తీస్తేనే గెలుస్తారని లేదు. అమ్మానాన్నల (కొండా మురళి, కొండా సురేఖ) ప్రస్థానాలు అంత ఈజీగా సాగలేదు. రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. వీరి కథ అందరికీ తెలియాలనే కొండా సినిమాను నిర్మించాను. అలాగే యువత రాజకీయాల్లోకి రావాలన్నది మరో కారణం’’ అని తెలిపారు. చదవండి: ఈసారి కొట్టా.. చంపేస్తా.. ఆసక్తిగా 'కొండా' రెండో ట్రైలర్.. ‘‘నేను హైదరాబాద్‌లో పెరిగాను. కానీ వరంగల్ గురించి, అక్కడి రాజకీయాల గురించి తెలీదు. ఈ సినిమా ద్వారా తెలుసుకున్నాను. ఇప్పటివరకు 17 సినిమాలు చేశాను. అన్ని సినిమాలు డబ్బులు తీసుకువచ్చాయి’’ అని త్రిగుణ్ పేర్కొన్నాడు. ‘‘సురేఖగారి పాత్రలో నటించగలనని నమ్మి నాకు అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అని ఐరా మోర్ తెలిపింది. -
ఈసారి కొట్టా.. చంపేస్తా.. ఆసక్తిగా 'కొండా' రెండో ట్రైలర్..
Ram Gopal Varma Konda Movie Second Trailer Released: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘కొండా’. తెలంగాణ రాజకీయాల్లో తమకంటూ ఒక ప్రత్యేకతని సాధించిన కొండా మురళీ, సురేఖల జీవిత నేపథ్యం ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించాడు వర్మ. ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో అదిత్ అరుణ్, ఐరా మోర్, పృథ్వీరాజ్ నటించారు. ఇదివరకు ఈ సినిమా మొదటి ట్రైలర్‌ను రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26నల విడుదల చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా తాజాగా శుక్రవారం (జూన్ 3) రెండో ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. 1990లో కారుపై జరిగిన కాల్పుల సన్నివేశంతో ట్రైలర్ ప్రారంభమైంది. పెత్తందార్ల పెత్తనం భరించలేక కొంతమంది బడుగు వర్గాలు తిరగబడి మొత్తం వ్యవస్థతోనే పోరాడుతున్న రోజులవి అంటూ ఆర్జీవీ చెప్పే డైలాగ్ ఇంటెన్సిటీని క్రియేట్ చేసింది. 'విపరీత పరిస్థితుల నుంచే విపరీత వ్యక్తులు ఉద్భవిస్తారని కార్ల్ మార్క్స్ 180 ఏళ్ల క్రితం చెప్పారు. అలాంటి విపరీత పరిస్థితుల మధ్య నుంచే పుట్టిన వ్యక్తి కొండా మురళీ' అంటూ మొదటి ట్రైలర్‌లాగానే హీరో పాత్రను పరిచయం చేశారు. ఈసారి కొట్టా, చంపేస్తా, ఆలోచనలు ఉంటే సరిపోదు స్వేచ్ఛ, బానిసత్వం, మనం చేసే పోరాటల గురించి కూడా తెల్వాలే అనే డైలాగ్‌లు, యాక్షన్, లవ్ సన్నివేశాలతో ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. అలాగే ఈ సినిమాను జూన్ 23న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. చదవండి: ‘కొండా’ సినిమా: పొలిటీషియన్‌కి ఆర్జీవీ ఇండైరెక్ట్ వార్నింగ్ కమల్ హాసన్ 'విక్రమ్' మూవీ ట్విటర్ రివ్యూ.. -
Kondaa Trailer: నా పేరు కొండా మురళీ.. ఏ మురళీ?
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘కొండా’. తెలంగాణ రాజకీయాల్లో తమకంటూ ఒక ప్రత్యేకతని సాధించిన కొండా మురళీ, సురేఖల జీవిత నేపథ్యాన్ని బేస్ చేసుకుని వర్మ ఈ సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమా షూటింగ్ ఇటీవల పూర్తయింది. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ‘కొండా’ ట్రైలర్ విడుదల చేశాడు ఆర్జీవీ. ‘సమాజం గురించి నీతులు చెప్పుడు కాదు.. బాగు చెయ్యాలె.. పోయేదేం లేదు.. బానిస సంకెళ్లు తప్ప’అంటూ ఆర్జీవీ వాయిస్‌తో ఈ ట్రైలర్ ప్రారంభం అవుతోంది. విపరీత పరిస్థితుల నుంచే విపరీత వ్యక్తులు ఉద్భవిస్తారని కార్ల్ మార్క్స్ 180 ఏళ్ల క్రితం చెప్పారు. అలాంటి విపరీత పరిస్థితుల మధ్య నుంచే పుట్టిన వ్యక్తి కొండా ముళీ’ అంటూ హీరోని పరిచయం చేశాడు ఆర్జీవీ. ఈ సినిమాలో కొండా మురళీగా త్రిగణ్, కొండా సురేఖ పాత్రలో ఈరా మోర్ నటించింది. ట్రైలర్‌లోని ప్రతి సీన్లోనూ త్రిగణ్ నటన అద్భుతంగా ఉంది. ‘నా నిర్ణయాలకు నేనే బాధ్యుడిని, కాబట్టి నా మాటే నేను వింటా’, నా పేరు కొండా మురళీ.. ఏ మురళీ? అనే డైలాగ్స్ ఆట్టుకునేలా ఉన్నాయి. -
‘కొండా’మూవీపై ఆర్జీవీ ఆసక్తికర వీడియో... స్టోరీ ఇదేనా!
Konda Movie Secrets Revealed by Rgv: కాంట్రవర్సీకి కేరాఫ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma). ఆయన సినిమా కథలన్నీ వివాదాల చుట్టూ అల్లుకున్నవే. తాజాగా ఆయన తెరకెక్కించిన మరో చిత్రం ‘కొండా’. తెలంగాణ రాజకీయాల్లో తమకంటూ ఒక ప్రత్యేకతని సాధించిన కొండా మురళీ, సురేఖల జీవిత నేపథ్యం బేస్ చేసుకుని వర్మ ఈ సినిమా తెరకెక్కించాడు. . ఈ సినిమా షూటింగ్ ఇటీవల పూర్తయింది. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ‘కొండా’ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు. ఈ సందర్భంగా ‘కొండా’ సినిమా గురించి చెప్తూ ఓ వాయిస్ ఓవర్ ఉన్న వీడియోని తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేశారు ఆర్జీవీ. ఈ వీడియోలో ‘కొండా’మూవీ ఎలా ఉండబోతుందో చెప్పేశాడు ఆర్జీవీ. ‘కనీ వినీ యెరుగని అసాధారణ పరిస్థితుల్లో, సాధారణ వ్యక్తులు కూడ అసాధారణ శక్తులుగా మారుతారు. అలా ఒక అసాధారణ శక్తిగా మారిన సాధారణ వ్యక్తే కొండా మురళి. కొండా లాంటి అసాధారణ శక్తికి, ఆదిపరా శక్తి లాంటి సురేఖ తోడైనప్పుడు ఆ శక్తులిద్దరిని చూసి ఓర్వలేక మనిషి రూపంలో ఉన్న కొందరు జంతువులు చేసిన క్షుద్ర మైన కుట్రలను, తిప్పికొడుతూ తెలంగాణలో చేసిన ఒక కురుక్షేత్ర యుద్దమే, మా కొండా చిత్రం. ఇకపోతే ఒక మాదిరి రంగులో ఉండే నల్ల సుధాకర్ విషయానికొస్తే కొన్ని పరిస్థితుల నుండి కొందరు నాయకులు పుడుతారు. కానీ పరిస్థితులను ఏర్పాటు చేసుకొని నాయకుడై, ఒకే అమ్మకి, నాన్నకి పుట్టానని పదే పదే చెప్పుకుంటూ తిరిగే వాడే నల్ల సుధాకర్. ఆర్కే, భారతక్క విషయానికొస్తే.. తెలంగాణలో ఒక్క సామెత ఉంది. 'పొట్టోన్ని పొడుగోడు కొడ్తే, పొడుగోన్ని పోశమ్మ కొట్టిందంటరు' ప్రజలను కాలరాస్తు బలిసిపోయిన నాయకులను, వాళ్ళకు అమ్ముడు పోయిన కొందరూ పోలీసులను, పోచమ్మలా నరికేదందుకు పుట్టినోళ్ళే ఆర్కే, భారతక్క. కార్ల్ మార్క్స్ చెప్పినట్టు విప్లవమనేది తుపాకీ తూటల్లో నుంచి కాదు, కొండా మురళి చెప్పినట్టు గుండెల్లోతుల్లోని బాధల నుంచి పుడుతుంది. అందుకే మనిషిని అనగదొక్కే పరిస్థితి ఉన్నంత వరకు, విప్లవం అనే ఒక దైవసర్పం కాటేస్తూనే ఉంటుంది. పెత్తందారులకి ఎదురు పోరాడిన ఆ కొండా దంపతుల కత్తులు బెజవాడ దుర్గమ్మ, అనంతపురం సుంకాలమ్మని మించిన మైసమ్మ శాక్తులుగా నాకు అనిపించ బట్టే మీకు కనిపించ చెయ్యబోతున్నాను.ఈ నిజాలన్ని మీకు కళ్ళకు కట్టినట్టుగా కొండా చిత్రంలో కనబడతాయి . కొండా చిత్రం మొదటి ట్రైలర్ జనవరి 26న, రిపబ్లిక్ డే రోజు ఉదయం 10గంటల 25 నిముషాలకి విడుదల కాబోతుంది. ఈ ఖచ్చితమైన సమయం నిర్ణయించడం వెనుక ఉన్న ఒకే ఒక్క కారణం ఏమిటంటే, యెన్నో సంవత్సరాల క్రితం సరిగ్గా జనవరి 26న, రిపబ్లిక్ డే రోజున అదే 10గంటల 25 నిముషాలకి కొండా మురళి పైన వంచనగిరిలో ఒక్క అత్యంత దారుణ హత్య ప్రయత్నం జరిగింది. మైసమ్మ దయ వల్ల కొండా బ్రతికి పోయినప్పటికి, ఆ దాడికి సంబంధించిన కొన్ని బుల్లెట్ లు ఇప్పటికీ ఆయన శరీరంలోనే ఉండి పోయాయి. ఆ బుల్లెట్లకి ముందు కథ, వాటి తర్వాత కథే మా కొండా కథ’అని చెబుతూ.. సినిమాపై మరింత ఆసక్తిని పెంచేశాడు ఆర్జీవి.