
కొండా మురళి, కొండా సురేఖ జీవిత చరిత్ర ఆధారంగా రామ్ గోపాల్ వర్మ తెరెక్కించిన చిత్రం ‘కొండా’. కొండా సుస్మిత పటేల్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా లో త్రిగుణ్ కొండా మురళి గా నటిస్తున్నారు. జూన్ 23 వ తేదీన ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమా లో నటుడు ప్రశాంత్ కార్తీ ఓ కీలక పాత్రలో నటించారు. అంతకుముందు ప్రశాంత్ కార్తీ పలు సినిమాల్లో నటించి గుర్తింపు దక్కించుకోగా ఈ సినిమాలో కీలక పాత్ర అయిన నక్సల్ లీడర్ ఆర్కే గా ఆయన కనిపించనున్నాడు.
ఈ పాత్ర గురించి సినిమా విశేషాల గురించి ప్రశాంత్ కార్తీ మాట్లాడుతూ.. ‘కొండా సినిమా లో ఒక పవర్ ఫుల్ పాత్రలో నటించాను. ఇప్పటివరకు నా కెరీర్ లో చేసిన పాత్రల్లో ఆర్కే పాత్ర ఎంతో ముఖ్యమైంది. ఇంతటి మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. ఆర్కే యొక్క విప్లవాత్మక ఆలోచనలు,నాకు చాలా స్ఫూర్తినిచ్చాయి. ఆయనలా కనిపించడానికి ప్రత్యేక సాధన చేశాను. తప్పకుండా అందరూ మెచ్చుకునేలా నా పాత్ర ఉంటుంది. అందరు అలరింపబడే విధంగా ఈ సినిమా ఉంటుంది’అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment