
రామ్‌గోపాల్‌వర్మ, కొండా మురళి, కొండా సురేఖ
ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ‘కొండా’ పేరుతో మరో బయోపిక్‌కి శ్రీకారం చుట్టారు. వరంగల్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి జీవిత కథ ఆధారంగా రూపొందనున్న ‘కొండా’ చిత్రం వరంగల్‌లో ప్రారంభం అయింది. అదిత్ అరుణ్, ఇర్రా మోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని కంపెనీ ప్రొడక్షన్ సమర్పణలో యోయో టాకీస్ పతాకంపై మల్లారెడ్డి, నవీన్ రెడ్డి నిర్మిస్తున్నారు.
రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘మురళి, సురేఖ గార్ల జీవిత కథని అందరికీ తెలియాలనే ‘కొండా’ చిత్రం నిర్మిస్తున్నాం. వారి జీవిత చరిత్రను పదిశాతం సినిమాలో చూపించినా నా ప్రయత్నం విజయవంతం అయినట్టే’’ అన్నారు. ‘‘నిజజీవితంలో కొండా దంపతులు ఎలా ధైర్యంగా నిలబడ్డారు? అనేది ‘కొండా’ ద్వారా చూపించబోతున్నాం’’ అన్నారు నిర్మాత ముకుంద్. ‘ ఈ చిత్రానికి కెమెరా: మల్హర్‌భట్ జోషి.
Comments
Please login to add a commentAdd a comment