Katha Kanchiki Manam Intiki Movie Trailer Out Now - Sakshi
Sakshi News home page

Katha Kanchiki Manam Intiki: నవ్విస్తూనే భయపెట్టారుగా!

Published Wed, Feb 23 2022 7:11 PM | Last Updated on Wed, Feb 23 2022 7:39 PM

Katha Kanchiki Manam Intiki Movie Trailer Out - Sakshi

యంగ్ హీరో తిృగున్‌, పూజిత పొన్నాడ జంటగా నటిస్తున్న తాజా చిత్రం‘కథ కంచికి మనం ఇంటికి’.యమ్.పి ఆర్ట్స్ బ్యానర్‌పై మోనిష్ పత్తిపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి చాణిక్య చిన్న దర్శకత్వం వహిస్తున్నారు.కామెడీ హారర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 18న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ ని విడుదల చేశారు మేకర్స్‌.

తిృగున్, పూజిత మధ్య ప్రేమతో మొదలైన ఈ ట్రైలర్.. హార్రర్ జోనర్‌లోకి టర్న్ తీసుకుంటుంది. ఆ తర్వాత చివరి వరకు ఆహ్లాదకరంగానే సాగింది. సప్తగిరి, గెటప్‌ శ్రీనుల కామెడీ నవ్వులు పూయిస్తుంది.ట్రైలర్‌ మాదిరే సినిమా కూడా ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుందని దర్శక నిర్మాతలు పేర్కొన్నారు.  భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు.. వైయస్ కృష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement