విజయ్ ధరన్ ధాట్ల, కేవీ గుహన్, రానా, అదిత్ అరుణ్, శివానీ రాజశేఖర్
‘‘గుహన్‌గారు ఒక యూనిక్ సినిమాటోగ్రాఫర్. ఆయనతో కలిసి పనిచేశాను. ‘డబ్లు్యడబ్లు్యడబ్లు్య’ పోస్టర్ చూస్తుంటే హై కాన్సెప్ట్ ఫిలిం అనిపిస్తోంది. ఈ సినిమాలో విజువల్స్ సరికొత్తగా ఉంటాయి. గుహన్‌గారు ఇలాంటి సినిమాలు మరెన్నో తీయాలి. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి’’ అన్నారు రానా. ‘118’ వంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వం వహించిన రెండో చిత్రం ‘డబ్లు్యడబ్లు్యడబ్లు్య’ (ఎవరు, ఎక్కడ, ఎందుకు). అదిత్ అరుణ్, శివానీ రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా రామంత్ర క్రియేషన్స్ పతాకంపై డా. రవి పి.రాజు ధాట్ల తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ని రానా విడుదల చేశారు.
కేవీ గుహన్ మాట్లాడుతూ– ‘‘లాక్‌డౌన్‌లో ఒక కొత్త కాన్సెప్ట్ అనుకుని ఈ సినిమా చేశాను. ఇది ఒక కాన్సెప్ట్ బేస్డ్ ఫిలిం. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న మా చిత్రాన్ని త్వరలోనే రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘మిస్టరీ థ్రిల్లర్‌గా గుహన్‌గారు ఈ సినిమాని బాగా తీశారు’’ అన్నారు డా. రవి పి.రాజు ధాట్ల. ‘‘కొత్త కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు గుహన్‌గారు’’ అన్నారు అదిత్ అరుణ్. ‘‘కేవీ గుహన్‌గారి సినిమాలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. నా తొలి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను లాంచ్ చేసిన రానాగారికి థ్యాంక్స్’’ అన్నారు శివానీ రాజశేఖర్. ‘‘ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు సహ నిర్మాత విజయ్‌ధరన్ ధాట్ల. ఈ చిత్రానికి సంగీతం: సైమన్ కె. కింగ్, కథ, స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ, దర్శకత్వం: కేవీ గుహన్.
Comments
Please login to add a commentAdd a comment