
నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘35– చిన్న కథ కాదు’. ఈ చిత్రానికి నంద కిశోర్ ఈమాని దర్శకత్వం వహించారు. సురేష్ ప్రోడక్షన్స్ ఎస్. ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రోడక్షన్స్ పై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రానికి ‘35– చిన్న కథ కాదు’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేసి, ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
ఆగస్ట్ 15న సినిమాని తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు కూడా అధికారికంగా ప్రకటించారు. ‘‘క్లీన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామా ‘35–చిన్న కథ కాదు’. స్కూల్ ఎపిసోడ్స్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా చక్కని వినోదంతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేందుకు ఈ సినిమా సిద్ధమైంది. తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: వివేక్ సాగర్, కెమెరా నికేత్ బొమ్మి.
Comments
Please login to add a commentAdd a comment