నవంబర్ 3న గరుడ వేగ | Raja sekhar garuda vega release date Confirmed | Sakshi
Sakshi News home page

నవంబర్ 3న గరుడ వేగ

Published Sun, Oct 8 2017 11:28 AM | Last Updated on Sun, Oct 8 2017 12:02 PM

Garuda Vega

సీనియర్ హీరో రాజశేఖర్ త్వరలో గరుడ వేగ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రాజశేఖర్ కెరీర్ లోనే  భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకుడు. శ్రద్దా దాస్, పూజ కుమార్, కిశోర్, ఆదిత్ లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ  సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది.

త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఇటీవల విడుదలైన గరుడవేగ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రాజశేఖర్ కౌంటర్ టెర్రరిజం ఫైటర్ గా నటిస్తున్న ఈ సినిమాను స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. ఎక్కువగా విదేశాల్లో చిత్రీకరణ జరుపుకున్న గరుడవేగ, నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement