జర్నలిస్ట్ పాత్రలో శ్రద్ధాదాస్
హీరోయిన్ శ్రద్ధాదాస్ 'పిఎస్‌వి గరుడవేగ 126.18ఎం' సినిమాలో జర్నలిస్ట్ పాత్ర చేస్తుంది. యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ హీరోగా, చందమామ కథలు, గుంటుర్ టాకీస్ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ పి.ఎస్.వి గరుడ వేగ 126.18 ఎం . ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ పాత బస్తీలో చిత్రీకరణను జరుపుకుంటుంది. ఈ సినిమాలో రాజశేఖర్ ఎన్ఐఎ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు.
రాజశేఖర్ కెరీర్‌లోనే పాతిక కోట్లకు పైగా బడ్జెట్‌తో తొలిసారిగా ఈ సినిమా రూపొందుతుంది. మెయిన్ విలన్ జార్జ్ పాత్రలో కిషోర్ నటిస్తున్నాడు. హీరోయిన్ పూజా కుమార్, రాజశేఖర్ భార్య పాత్రలో నటిస్తుంది. గుంటూరు టాకీస్ చిత్రంలో హిలేరియస్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటించిన శ్రద్ధాదాస్ ఈ సినిమాలో కాంటెంపరరీ జర్నలిస్ట్ పాత్రలో కనపడనుంది. ప్రముఖ పాత్రికేయుడు అర్నాబ్ గోస్వామి స్థాయికి రావాలని కలలు కనే ఓ యంగ్ జర్నలిస్ట్ మనాలిగా బెంగాలీ బ్యూటీ శ్రద్ధాదాస్ అలరించనుంది.
శ్రద్ధాదాస్ రియల్ లైఫ్ లోనూ జర్నలిజం స్టూడెంట్ కావడంతో మనాలి పాత్రలో ఒదిగిపోయింది. అదిత్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా మరో కీలకపాత్రలో నటిస్తున్నాడు. సన్నిలియోన్ స్పెషల్ సాంగ్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. నాజర్, చరణ్ దీప్ తదితరులు రాజశేఖర్ ఎన్ఐఎ టీం సభ్యులుగా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను రిలీజ్ డేట్ ను త్వరలోనే ప్రకటించనున్నారు.