శ్రద్ధా దాస్
ఏంటి? ఏను? ఎక్కడ? అల్లి... ఏంటీ తికమకగా ఉందా? ఇప్పటినుంచి కొన్ని నెలల పాటు శ్రద్ధా దాస్ ఇలా తెలుగు, కన్నడ మాట్లాడబోతున్నారు. ఎందుకు? అంటే.. ఏకకాలంలో తెలుగు, కన్నడ భాషల్లో ఓ సినిమా అంగీకరించారామె. తెలుగులో సీన్ తీసిన వెంటనే కన్నడంలో అదే సీన్ తీసేలా షూటింగ్‌ని ప్లాన్ చేశారు చిత్రదర్శకుడు సునిల్‌కుమార్ దేశి. చాలా గ్యాప్ తర్వాత తెలుగులో రాజశేఖర్ ‘పీఎస్వీ గరుడవేగ 126.18ఎమ్’తో ఓ హిట్ అందుకున్నారు శ్రద్ధా. ఆ జోష్‌తో ఈ ద్విభాషా చిత్రం చేయడానికి రెడీ అయ్యారు.
కన్నడ వెర్షన్‌కి ‘ఉద్గర్శ’ అని టైటిల్ ఖరారు చేశారు. ఇంకా తెలుగు చిత్రానికి పేరు పెట్టలేదు. ‘‘ఉద్గర్శ’ సినిమాలో మోస్ట్ గ్లామరస్ గర్ల్‌గా నటిస్తున్నా. కన్నడ– తెలుగు డైలాగ్స్‌ను బ్యాక్ టు బ్యాక్ చెప్పడం చాలెంజింగ్‌గా ఉంది. బట్ ఈ చాలెంజ్ భలేగా ఉంది’’ అన్నారు శ్రద్ధాదాస్.
Comments
Please login to add a commentAdd a comment