'గరుడ వేగ'గా సీనియర్ హీరో
కొంత కాలంగా సరైన హిట్స్ లేక కష్టాల్లో పడ్డ సీనియర్ హీరో, మరోసారి తన ట్రేడ్ మార్క్ సినిమాతో ఆడియన్స్ ను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. గతంలో వరుసగా యాంగ్రీ రోల్స్ లో సక్సెస్ లు సాధించిన రాజశేఖర్ లాంగ్ గ్యాప్ తరువాత అదే తరహా పాత్రలోకనిపించనున్నాడు. ఇటీవల విలన్ రోల్స్ కూడా సై అన్న రాజశేఖర్ హీరోగా ఫాంలోకి వచ్చేందుకు కష్టపడుతున్నాడు.
గుంటూరు టాకీస్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు, రాజశేఖర్ హీరోగా ఓ యాక్షన్ థ్రిల్లర్ ను తెరకెక్కిస్తున్నాడు. ఈ రోజు(శుక్రవారం) రాజశేఖర్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. 'పిఎస్వి గరుడ వేగ 128.18ఎమ్' అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎమ్ కోటేశ్వర రాజు నిర్మిస్తున్నారు.