![Priyamani Talks About Her No Kissing Policy Films - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/1/priyamani.jpg.webp?itok=b5viTXWx)
కథానాయకిగా నటి ప్రియమణికి మంచి పేరు ఉంది. బెంగళూరుకు చెందిన ఈ బ్యూటీ కన్నడ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటించి పాపులర్ అయింది. తెలుగులో కొంతకాలం స్టార్ హీరోయిన్‌గా రాణించిన ప్రియమణి పెళ్లి తర్వాత సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవల నాగచైతన్య 'కస్టడీ'లో సీఎంగా మెప్పించింది. త్వరలో షారుఖ్ 'జవాన్' చిత్రంతో రాబోతుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది ప్రియమణి. కిస్ సీన్లకు బ్రేక్ ఇవ్వడానికి కారణం ఏంటో తాజాగా వెల్లడించింది.
(ఇదీ చదవండి: ఆమెతో సుధీర్ నిశ్చితార్ధం.. మరీ రష్మి పరిస్థితి ఏంటి అంటూ..)
'నేను స్క్రీన్‌పై ముద్దు సీన్లలో నటించకూడదని అనుకున్నాను. ఇప్పుడు నేను అలాంటి పాత్రలు చేయడం కరెక్ట్ కాదనిపించింది. సినిమాలో నాది ఒక పాత్ర అయినా వ్యక్తిగతంగా దాని వల్ల ఇబ్బంది పడతాను. అలాంటి సన్నివేశాల్లో నటిస్తే నా భర్తకు నేను సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అంతేకాకుండా నేను తెరపై మరొక వ్యక్తిని ముద్దుపెట్టుకోవడం అంత సౌకర్యంగా కూడా అనిపించదు.' అని చెప్పింది.
2021లో ZEE5లో వచ్చిన 'హిస్ స్టోరీ' వెబ్ సీరిస్‌లో సత్యదీప్ మిశ్రాతో రొమాన్స్ సీన్‌తో పాటు ముద్దు పెట్టుకునే సన్నివేశాలు ఉన్నాయని మేకర్స్ చెప్పారు. కానీ వాటికి ఒప్పోకోలేదని ప్రియమణి గుర్తుచేసింది. అలాంటి సన్నివేశాలలో నటించమని భారీ ప్రాజెక్ట్‌లు వచ్చాయి. అంతే కాకుండా భారీగానే రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు. పెళ్లి తర్వాత అలాంటి వాటిలో నటించకూడదని కండీషన్స్ పెట్టుకున్నట్లు ప్రియమణి చెప్పుకొచ్చింది.
(ఇదీ చదవండి: Trolls On Bro Teaser: ఇదేం ట్రోలింగ్ 'బ్రో'.. ఆడుకుంటున్నారుగా!)
2017లో తనకు వివాహమైన దగ్గరి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి బోల్డ్ సీన్స్‌లో నటించలేదు. సినిమాను అంగీకరించడానికి ముందే ఈ విషయం గురించి దర్శక-నిర్మాతలకు తెలియజేస్తానని చెప్పింది. ఏ సినిమాలో నటించినా దాన్ని తమ ఇరు కుటుంబాల వాళ్లు చూస్తారు. అలాంటి సన్నివేశాల వల్ల వాళ్లు ఇబ్బంది పడడం తనకు ఇష్టం ఉండదని పేర్కొంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రియమణి అని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment