
సాధారణంగా 40 ఏళ్లకు చేరువైతే హీరోయిన్లకు ఛాన్సులు తగ్గిపోతాయి. ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోతారు. ప్రియమణికి మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టు, హీరోయిన్ గా వరస అవకాశాలు వస్తున్నాయి. అలా ప్రస్తుతం బిజీగా ఉంది. రీసెంట్ గానే 'మైదాన్' చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించింది.
(ఇదీ చదవండి: డైరెక్టర్ శంకర్ కూతురికి రెండో పెళ్లి.. కుర్రాడు ఎవరంటే?)
సినిమాకు సంబంధించిన పలు ప్రమోషన్లలో పాల్గొన్న ప్రియమణికి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. అలా తాజాగా ఓ ఇంటర్వ్యూలో.. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఎదురైన ట్రోల్స్ గురించి మాట్లాడింది. తనతో పాటు తల్లిదండ్రులు కూడా ఈ ట్రోలింగ్ వల్ల ఇబ్బంది పడ్డారని చెప్పుకొచ్చింది.
'నిజం చెప్పాలంటే నాతో పాటు నా కుటుంబాన్ని కూడా చాలా ట్రోల్ చేశారు. నా తల్లిదండ్రులు దీని వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. కానీ నా భర్త మాకు అండగా నిలబడ్డాడు. ఏం జరిగినా సరే నేను చూసుకుంటానని భరోసా ఇచ్చాడు. ఇలాంటి అండర్ స్టాండింగ్ ఉన్న భర్త దొరకడం నిజంగా నా అదృష్టమని చెప్పాలి. ఆయనకు పరిస్థితుల్ని ఎలా హ్యాండిల్ చేయాలో బాగా తెలుసు' అని ప్రియమణి చెప్పుకొచ్చింది. ఇకపోతే 2017లో ప్రియమణి.. ముస్తాఫా రాజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.
(ఇదీ చదవండి: నయనతార తీసిన సినిమాకు సీఏఐబీ అవార్డ్)
Comments
Please login to add a commentAdd a comment